సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి స్థాయిలో నగర వాసులకు అందుబాటులోకి రానుంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గాన్ని ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిచనున్నారు. ఈ మేరకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జెబీఎస్ నుంచి ఎమ్‌జీబీఎస్‌కు రోడ్డు మార్గం ద్వారా వెల్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ సమస్య కారణంగా ఈ మార్గంలో ప్రయాణం దాదాపుగా 40 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. అదే మెట్రో రైల్‌లో అందుబాటులోకి వస్తే.. కేవలం 15నిమిషాల్లోన్నే గమ్యాన్ని చేరుకోవచ్చు. దీంతో ప్రయాణికుల ట్రాఫిక్ సమస్య ఇక తీరనుంది.
కాగా ఈ మార్గం పూర్తవడంతో నగరంలో మొత్తం 69 కిలోమీటర్ల మెట్రోరైల్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది. మొత్తం 72 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నగరంలో ఏర్పాటు చేయాలనుకున్నా, ఎమ్‌జీబీఎస్ నుంచి ఫలక్‌నామ నిర్మాణ దశలోనే ఆగిపోయింది. ఆ 5 కిలోమీటర్ల మినహాయిస్తే హైదరాబాద్‌లో మెట్రోరైల్ నిర్మాణం మొత్తం పూర్తయినట్లే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment