jubli bus station
-
జేబీఎస్ వద్ద అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ మెట్రో రైల్ హబ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రెండో దశలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టనుంది. జేబీఎస్ (JBS) వద్ద ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ మెట్రో రైల్ హబ్ ఏర్పాటు దిశగా పరిశీలిస్తోంది. ఫలితంగా మేడ్చల్, శామీర్ పేట్ (Shamirpet) దిశగా సాగే కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు ప్యారడైజ్ – మేడ్చల్ (23 కి.మీ.), జేబీఎస్ – శామీర్‌పేట్ (22 కి.మీ.) ప్రతిపాదిత కారిడార్ అలైన్మెంట్ విషయంలో సాంకేతిక సవాళ్లను పరిష్కరించడానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, (NVS Reddy) సీనియర్ ఇంజినీర్లు, సాంకేతిక సలహాదారులు ఆదివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బేగంపేట్ విమానాశ్రయం, ప్యారడైజ్, బోయినపల్లి వరకు రహదారి వంపు ఎక్కువగా ఉండటం, విమానాశ్రయ అధికారుల ఆంక్షల కారణంగా, హెచ్ఏండీఎ తన ఎలివేటెడ్ మార్గాన్ని కొంత దూరం పాటు భూగర్భ మార్గంగా మార్చుకుంది. ఈ అలైన్‌మెంట్‌ను బేగంపేట విమానాశ్రయం (తాడ్‌బండ్/బోయినపల్లి వైపు) రన్‌వే కింద దాదాపు 600 మీటర్ల దూరం భూగర్భ సొరంగం ద్వారా తీసుకువెళ్తుంది. దీనికి సంబంధించిన సమస్యలను అధిగమించేందుకు మెట్రో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పలు ప్రాంతాల పరిశీలన.. మేడ్చల్, శామీర్ పేట్ కారిడార్ల స్థానాన్ని జేబీఎస్ వద్ద ఏకీకృతం చేయడం, ఇక్కడ ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ మెట్రో రైల్ హబ్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం జేబీఎస్ పరిసరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, రక్షణ శాఖకు చెందిన సుమారు 30 ఎకరాల భూమిని సమీకరించవచ్చని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. జేబీఎస్ – సికింద్రాబాద్ క్లబ్‌రోడ్, స్టాఫ్ రోడ్ (పికెట్ కేంద్రీయ విద్యాలయ స్కూల్ రోడ్), మడ్ ఫోర్ట్, టివోలీ, డైమండ్ పాయింట్, సెంటర్ పాయింట్, హస్మత్‌పేట్, బోయినపల్లి (సరోజిని పుల్లారెడ్డి బంగ్లా) రోడ్, తాడ్‌బండ్–ఆంజనేయ స్వామి ఆలయం –తాడ్‌బండ్ జంక్షన్, ఎయిర్ పోర్ట్ ఆఫీస్, బోయినపల్లి చెక్ పోస్ట్ తదితర ప్రాంతాల్లో మెట్రో ఎండీ కాలినడకన కలియతిరిగారు.లాభ నష్టాలను బేరీజు వేయండి..క్లిష్టమైన మలుపులను, విమానాశ్రయం కింద భూగర్భంలో అలైన్‌మెంట్‌ను తీసుకువెళ్లే ఆవశ్యకతను నివారించే విధంగా, ప్రైవేట్ ఆస్తుల సేకరణను వీలైనంత తగ్గించే విధంగా ప్రత్యామ్నాయ మార్గాల లాభనష్టాలను అంచనా వేయాలని అధికారులను ఎన్వీఎస్ రెడ్డి ఆదేశించారు. అలైన్మెంట్ వీలైనన్ని ఎక్కువ నివాస కాలనీలకు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ప్రయోజనకరంగా ఉండాలని, స్టేషన్ స్థానాల నిర్ధారణ, వాటి సమీపంలో ఖాళీగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ/రక్షణ భూముల లభ్యత, మెరుగైన పార్కింగ్, ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలను పరిశీలించాలన్నారు.ఇదీ చదవండి: ముందు డిజైన్లు.. ఆపై టెండర్లుజేబీఎస్ వద్ద ప్రారంభంలో రెండు మెట్రో కారిడార్లను కలపడం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మేడ్చల్–జేబీఎస్–ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట– విమానాశ్రయ లింక్ కూడా ఏర్పడుతుందని, దాదాపు 60 కిలోమీటర్ల సుదీర్ఘ మెట్రో కారిడార్ ఏర్పాటు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. పర్యటనలో హెచ్ఏఎంఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్లు బి.ఎన్. రాజేశ్వర్, ఎం. విష్ణు వర్ధన్ రెడ్డి, ఎ.బాలకృష్ణ, డిప్యూటీ సీఈ (రైల్వేస్) జె.ఎన్. గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
పల్లెబాట పట్టిన నగరవాసులు
-
TSRTC: రాత్రివేళల్లోనూ శ్రీశైలం బస్సులు
సాక్షి, హైదరాబాద్: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఈ నెల 20 వరకు రాత్రి వేళల్లో ఎక్కడా ఆగకుండా శ్రీశైలంలో దర్శనం చేసుకునేలా వీలు కల్పించారు. ప్రస్తుతం రాత్రివేళల్లో ఘాట్ రోడ్ల వద్ద బస్సులను నిలిపి తిరిగి ఉదయం వేళల్లో ఫారెస్ట్ అధికారులు బస్సులను అనుమతించేవారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రిజినల్ రీజియన్ మేనేజర్ ఎ.శ్రీధర్ ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్ల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మున్ననూర్, దోమలపెంట చెక్‌పోస్టుల వద్ద నిలపకుండా రాత్రివేళల్లోనూ ప్రయాణానికి అనుమతించాలని ఫారెస్ట్ అధికారులకు విన్నవించారు. ఇందుకు అంగీకరించిన తెలంగాణ ఫారెస్ట్ అధికారి రాకేష్ మోహన్ డోపిడియాల్ ఈ నెల 20 వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రాత్రివేళల్లో బస్సులను అనుమతించిన ఫారెస్ట్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. (క్లిక్ చేయండి: ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు.. వచ్చేస్తున్నాయ్!) -
బతుకు బండి కదిలింది
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘమైన లాక్డౌన్ తర్వాత మహానగరంలో బతుకు బండి కదిలింది. సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్‌మాల్స్ మినహా అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు మొదలయ్యాయి. మెకానిక్ షాపుల మొదలు చెప్పుల దుకాణాల వరకు అన్నీ తెరుచుకున్నాయి. ఆటోలు, ట్యాక్సీలు, తదితర వాహనాలన్నీ రోడ్డెక్కాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌తో 2 నెలలుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు రోడ్లపైకి వచ్చారు. వ్యాపార కార్యకలాపాలు నెమ్మదిగా మొదలయ్యాయి. లాక్డౌన్ దృష్ట్యా మందుల షాపులు, కిరాణా షాపులు, పాలు, పండ్లు, కూరగాయలు వంటి వాటికే అనుమతిచ్చారు. ఆ తర్వాత రెండోదశలో నిర్మాణ రంగానికి చెందిన వస్తు విక్రయాలకు సడలింపు లభిం చింది. వైన్స్ సైతం తెరుచుకున్నాయి. ఎలక్ట్రానిక్స్ షాపులు, ఆటోమొబైల్ షోరూంలకు అనుమతిచ్చారు. తాజాగా ప్రజలు ఎక్కువగా గుమి గూడేందుకు అవకాశం ఉన్న మాల్స్, సినిమా హాల్స్, హోటళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు మినహా అన్నింటికీ అనుమతివ్వడంతో వస్త్ర దుకాణాలు సహా అన్నీ తెరుచుకున్నాయి. వివిధ అవసరాల కోసం జనం పెద్ద ఎత్తున బయట కొచ్చారు. ఆటోలు, క్యాబ్‌లు సైతం అందుబాటులోకి రావడంతో ప్రజా రవాణా సదుపాయాలు సైతం పాక్షికంగా అందుబాటులోకి వచ్చినట్లయింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్‌లపై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మెహిదీపట్నంలో రోడ్డెక్కిన ఆటో.. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 1.4 లక్షల ఆటోలు రోడ్డెక్కాయి. అలాగే ఉబర్, ఓలా, తదితర సంస్థలకు చెందిన క్యాబ్‌లు, ట్యాక్సీలు సైతం అందుబాటులోకి వచ్చాయి. మొదటి రోజు సుమారు 26 వేలకు పైగా వాహనాలు రోడ్డెక్కినట్లు తెలంగాణ క్యాబ్‌డ్రైవర్స్ అసోసియేషన్ తెలిపింది. ఐటీ కారిడార్లలో ఈ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ క్యాబ్ అగ్రిగేటర్లు డ్రైవర్ల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, వాహనాలు నడపడంలో ఇబ్బందిగా ఉందని అసోసియేషన్ ప్రతినిధి షేక్ సలావుద్దీన్ తెలిపారు. మరోవైపు ట్యాక్సీలు, క్యాబ్‌లు, ఆటోలు అందుబాటులో ఉన్నప్పటికీ కరోనా ఉధృతి దృష్ట్యా నగరవాసులు ఆచితూచి ప్రయాణం చేస్తున్నారు. అవసరమైతే తప్ప వాటిని వినియోగించుకోవట్లేదు. వీలైనంత వరకు సొంత వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రజారవాణా వాహనాల కంటే కార్లు, ద్విచక్ర వాహనాల రద్దీయే ఎక్కువగా కన్పిస్తోంది. వ్యాపార కేంద్రాలు తెరుచుకున్నా.. కొనుగోళ్లు మాత్రం ఊపందుకోలేదు. తిరిగి సాధారణ వాతావరణం నెలకొనేందుకు మరో వారం రోజులు పట్టొచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ దుకాణం ముందు చెప్పులు కుడుతున్న దృశ్యం.. శివార్లకే పరిమితం.. హైదరాబాద్ మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బస్సుల రాకపోకలకు అనుమతివ్వడంతో సుమారు 400 బస్సులు మొదటి రోజు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. వీటిని నగర శివార్ల వరకే అనుమతించారు. 139 బస్సులు జేబీఎస్ వరకు వచ్చాయి. కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాటిని జేబీఎస్ వరకు అనుమతించారు. వరంగల్, హన్మకొండ, జనగామ వైపు నుంచి 60 బస్సులు ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు వచ్చాయి. ఖమ్మం, నల్లగొండ మీదుగా వచ్చే వాటిని హయత్‌నగర్ వరకు అనుమతించారు. 70 బస్సులు ఈ రూట్లో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లాయి. మహబూబ్‌నగర్ వైపు నుంచి 102 బస్సులు వచ్చాయి. ఇవి ఆరాంఘడ్ వరకు రాకపోకలు సాగించాయి. చేవెళ్ల, శంకర్పల్లి నుంచి వచ్చిన 30 బస్సులు అప్పా జంక్షన్ వరకు రాకపోకలు సాగించాయి. బస్సుల నిర్వహణలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించారు. మొదటి రోజు కావడంతో ప్రయాణికుల సంఖ్య తక్కువగానే ఉంది. ఒక్కో బస్సులో 20 నుంచి 30 మంది మాత్రమే ప్రయాణం చేశారు. బస్సులు ఎక్కే సమయంలో మాస్కు ఉన్న వారినే లోపలికి అనుమతించారు. భౌతిక దూరం పాటించేలా ఆర్టీసీ సిబ్బంది బస్స్టాండ్లలో విధులు నిర్వహించారు. బస్సు ఎక్కిన ప్రయాణికులు తప్పనిసరిగా శానిటైజర్ ద్వారా చేతులు శుభ్రం చేసుకొన్న తర్వాతే సీట్లోకి వెళ్లి కూర్చునేలా డ్రైవర్లు జాగ్రత్తలు పాటించారు. -
నగర వాసులకు మరో శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి స్థాయిలో నగర వాసులకు అందుబాటులోకి రానుంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గాన్ని ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిచనున్నారు. ఈ మేరకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జెబీఎస్ నుంచి ఎమ్‌జీబీఎస్‌కు రోడ్డు మార్గం ద్వారా వెల్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ సమస్య కారణంగా ఈ మార్గంలో ప్రయాణం దాదాపుగా 40 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. అదే మెట్రో రైల్లో అందుబాటులోకి వస్తే.. కేవలం 15నిమిషాల్లోన్నే గమ్యాన్ని చేరుకోవచ్చు. దీంతో ప్రయాణికుల ట్రాఫిక్ సమస్య ఇక తీరనుంది. కాగా ఈ మార్గం పూర్తవడంతో నగరంలో మొత్తం 69 కిలోమీటర్ల మెట్రోరైల్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది. మొత్తం 72 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నగరంలో ఏర్పాటు చేయాలనుకున్నా, ఎమ్జీబీఎస్ నుంచి ఫలక్నామ నిర్మాణ దశలోనే ఆగిపోయింది. ఆ 5 కిలోమీటర్ల మినహాయిస్తే హైదరాబాద్‌లో మెట్రోరైల్ నిర్మాణం మొత్తం పూర్తయినట్లే చెప్పాలి. -
ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉధృతి
-
ఆర్టీసీ సమ్మె: ఆందోళన ఉధృతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆందోళన మరింత ఉధృత రూపం దాల్చింది. డిమాండ్ల పరిష్కారం కోసం 18 వరోజూ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అఖిల పక్షం వంటా వార్పునకు పిలుపు నిచ్చింది. సికింద్రాబాద్‌లోని జేబీఎస్ వద్ద ఆర్టీసీ జేఏసీ, రాజకీయ జేఏసీ నేతలు, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకోవైపు ఆర్టీసీ సమ్మె విద్యార్థులు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. బస్సుల కొరత కారణంగా వారు నానా పాట్లు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత ఆర్టీసీ కార్మికుల సమ్మె కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. సమ్మెలో భాగంగా కార్మికులు వేకువజామునే కరీంనగర్ బస్ స్టేషన్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. పార్కింగ్ స్థలంలో ఉన్న ఆర్టీసీ అద్దె బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడంతో అద్దం ద్వంసమయింది. సమ్మెకు సహకరించాలని బస్సులు నడిపే తాత్కాలిక డ్రైవర్లను కార్మికులు కోరారు. బస్ స్టేషన్లో ఉన్న బస్సును డిపోలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు బస్సులు బయటికి వెళ్లకుండా నిలిచిపోయాయి. బస్సులను అడ్డుకున్న జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీతాలు లేక న్యాయమైన డిమాండ్ కోసం కార్మికులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని నేతలు విమర్శించారు. -
బస్సు సీటు కోసం.. ఎన్ని పాట్లో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భావించనప్పటికీ పూర్తి స్థాయితో సాధ్యపడటం లేదు. దీంతో అరకొర బస్సులు మాత్రమై రోడ్డుపైకెక్కాయి. బస్టాండ్లకు వచ్చిన అతికొద్ది బస్సులను ప్రజలు చుట్టుముడుతున్నారు. జూబ్లీ బస్టాండ్‌లో ఓ మహిళ తమ ప్రాంతానికి వెళ్లే బస్సు రావడంతో తన ఇద్దరి పిల్లలని బస్సు ఎక్కించడానికి తెగ హైరానాపడింది. బస్సు కిటికీలో నుంచి తన ఇద్దరి పిల్లలని లోపలికి పంపించి సీట్లలో కూర్చో బెట్టే ప్రయత్నం చేసింది. ఈ బస్సు తప్పితే మరొక బస్సు వస్తదో రాదో అని భయంతో ఆ మహిళ ఇలా రిస్క్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం అర్దరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. కొన్ని చోట్ల మినహా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రశాంతంగా సాగుతోంది. డిపో, బస్టాండ్ల ముందు కార్మికులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే చాలావరకు డిపో, బస్టాండ్లను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలను జరగుకుండా జాగ్రత్త పడుతున్నారు. కాగా, అధికారులు సమ్మె ప్రభావం తగ్గించడానికి ప్రైయివేట్ బస్సులు, డ్రైవర్లతో బస్సులు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రత్యామ్నాయాలు ప్రయాణికులకు ఏమాత్రం ఉపశమనం లభించడంలేదు. -
ఆర్టీసీ సమ్మె.. ప్రజల ఇబ్బందులు
-
రెండు నెలల చిన్నారి కిడ్నాప్
సికింద్రాబాద్: జూబ్లీ బస్టాండ్‌లో శనివారం రాత్రి రెండు నెలల బాబు అపహరణకు గురయ్యాడు. కరీంనగర్ పట్టణానికి చెందిన బుర్రా రజిత(26) తన ముగ్గురు పిల్లలు, తల్లి విజయతో కలసి యాదగిరి గుట్టకు వెళ్లింది. కరీంనగర్‌కు తిరిగి వెళ్తుండగా జూబ్లీ బస్టాండ్‌లో చిన్నారిని పక్కనే ఉన్న ఓ మహిళకు ఇచ్చి బాత్రూంకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన ఆ మహిళ చిన్నారితో పరారైంది. చిన్నారి కోసం చుట్టుపక్కల గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.