సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భావించనప్పటికీ పూర్తి స్థాయితో సాధ్యపడటం లేదు. దీంతో అరకొర బస్సులు మాత్రమై రోడ్డుపైకెక్కాయి. బస్టాండ్లకు వచ్చిన అతికొద్ది బస్సులను ప్రజలు చుట్టుముడుతున్నారు. జూబ్లీ బస్టాండ్‌లో ఓ మహిళ తమ ప్రాంతానికి వెళ్లే బస్సు రావడంతో తన ఇద్దరి పిల్లలని బస్సు ఎక్కించడానికి తెగ హైరానాపడింది. బస్సు కిటికీలో నుంచి తన ఇద్దరి పిల్లలని లోపలికి పంపించి సీట్లలో కూర్చో బెట్టే ప్రయత్నం చేసింది. ఈ బస్సు తప్పితే మరొక బస్సు వస్తదో రాదో అని భయంతో ఆ మహిళ ఇలా రిస్క్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శుక్రవారం అర్దరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. కొన్ని చోట్ల మినహా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రశాంతంగా సాగుతోంది. డిపో, బస్టాండ్ల ముందు కార్మికులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే చాలావరకు డిపో, బస్టాండ్లను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలను జరగుకుండా జాగ్రత్త పడుతున్నారు. కాగా, అధికారులు సమ్మె ప్రభావం తగ్గించడానికి ప్రైయివేట్ బస్సులు, డ్రైవర్లతో బస్సులు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రత్యామ్నాయాలు ప్రయాణికులకు ఏమాత్రం ఉపశమనం లభించడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment