
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బుధవారం ఓ ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన అబీబా బేగం(45) ఇంటినుంచి మార్కెట్ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో ఆర్టీసీ అద్దె బస్సు నందిపేటనుంచి నిజామాబాద్ వైపు వస్తోంది. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వెనుకనుంచి అబీబా బేగంను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది. బస్సు డ్రైవర్ కర్షక్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్‌హెచ్‌వో తెలిపారు. కాగా అనుభవం లేని డ్రైవర్ బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment