
సాక్షి, విజయవాడ: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ దామోదరరావు వెల్లడించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా 19న ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు. సమ్మెపై ఈ నెల 19న ఏపీఎస్‌ఆర్టీసీ జేఏసీ సమావేశమై భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని.. అవసరమైతే.. దేశవ్యాప్తంగా ఉన్న రవాణా రంగం కార్మికులను అందరిని ఉద్యమానికి సన్నద్ధం చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండాలని.. ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ జేఏసీ కోకన్వీనర్ సుందరయ్య, వరహాల్ నాయుడు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment