
మాట్లాడుతున్న జేఏసీ నాయకులు
సాక్షి, మందమర్రిరూరల్(చెన్నూర్) : డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సింగరేణి కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. జేఏసీ నాయకులు శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి కార్మికులను అణచివేస్తు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల్లో ఐక్యతను దెబ్బతీసే విధంగా సింగరేణి మెకానిక్ కార్మికులను ఆర్టీసీలో విధుల నిర్వహణ కోసం పురమాయించడం హేయమైన చర్య అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి సమస్యను పరిష్కరించాలని లేకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు వెంకన్న, ఐఎన్టీయూసీ ఏరియా ఉపాద్యక్షుడు సమ్మయ్య, సీఐటీ యూ నాయకులు వెంకటస్వామి, హెచ్‌ఎంఎస్ నాయకులు సుదర్శన్, ఐఎఫ్‌టీయూ నాయకులు జాఫర్, టీఎస్‌యూఎస్ నాయకులు రాజిరె డ్డి తదితరులు పాల్గొన్నారు.