తెలంగాణ ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భావించనప్పటికీ పూర్తి స్థాయితో సాధ్యపడటం లేదు. దీంతో అరకొర బస్సులు మాత్రమై రోడ్డుపైకెక్కాయి. బస్టాండ్లకు వచ్చిన అతికొద్ది బస్సులను ప్రజలు చుట్టుముడుతున్నారు. జూబ్లీ బస్టాండ్‌లో ఓ మహిళ తమ ప్రాంతానికి వెళ్లే బస్సు రావడంతో తన ఇద్దరి పిల్లలని బస్సు ఎక్కించడానికి తెగ హైరానాపడింది. బస్సు కిటికీలో నుంచి తన ఇద్దరి పిల్లలని లోపలికి పంపించి సీట్లలో కూర్చో బెట్టే ప్రయత్నం చేసింది. ఈ బస్సు తప్పితే మరొక బస్సు వస్తదో రాదో అని భయంతో ఆ మహిళ ఇలా రిస్క్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.