సమ్మెపై తెలంగాణ కార్మిక సంఘాలు పట్టు వీడటం లేదు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు శనివారం ఎంజీబీఎస్‌లో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేసీఏ నేత అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలని అన్నారు. తమతో ప్రభుత్వం చర్చలు జరిపితేనే సమ్మెపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎస్మాకు భయపడేది లేదని, ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తామని అన్నారు. ప్రభుత్వం బెదిరింపులకు కార్మికులు భయపడవద్దని అశ్వత్థామరెడ్డి కోరారు.