
ఎంజీబీఎస్ ప్లాట్‌ఫామ్‌లలో మార్పులు
► వోల్వో, గరుడ కార్నర్ మార్పు
► విజయవాడ వైపు వెళ్లే బస్సులు 35వ ప్లాట్‌ఫామ్‌కు
సాక్షి, సిటీబ్యూరో: మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికుల సౌకర్యం, బస్సుల నిర్వహణలో సౌలభ్యం కోసం స్వల్ప మార్పులు చేసినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. ఇప్పటి వరకు 21వ ప్లాట్ ఫామ్ నుంచి 24 వరకు నిలిపే గరుడ, గరుడ ప్లస్, వెన్నెల, అమరావతి, ఐరావత్ బస్సులను తాజాగా ఒకటో ప్లాట్‌ఫాం నుంచి 5వ ప్లాట్‌ఫాంకు మార్చారు. అలాగే 6వ నెంబర్ నుంచి 12వ ప్లాట్‌ఫామ్ వరకు నిలిపే విజయవాడ, తెనాలి, ఏలూరు సెక్టర్ బస్సులను 35వ ప్లాట్‌ఫామ్ నుంచి 45వ ప్లాట్‌ఫామ్‌కు తరలించారు. మిగతావన్నీ యథాతథంగానే ఉంటాయని తెలిపారు.
ఆసియాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు 3500 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు లక్షా 50 వేల మందికి పైగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూర్, ముంబయి, చెన్నై, షిరిడీ, తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 79 ప్లాట్‌ఫామ్‌లు ఉన్న ఎంజీబీఎస్‌లో ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకొన్నాయి. మౌలిక సదుపాయాల కల్పన, మంచినీరు, పారిశుధ్యం, తదితర సదుపాయాలను ఆధునీకరించారు.
ఏ ప్లాట్‌ఫామ్ పై ఏ బస్సులు....
- 1 నుంచి 5 ప్లాట్‌ఫారం వరకు: గరుడ, గరుడ ప్లస్, వెన్నెల, అమరావతి, ఐరావత్ బస్సులన్నీ నిలపనున్నారు.
- 6 నుంచి 7 వరకు: బెంగళూరు వెళ్లే టీఎస్‌ఆర్టీసీ బస్సులు
- 8వ ప్లాట్‌ఫారం: బెంగళూరు వెళ్లే కేఎస్‌ఆర్టీసీ బస్సులు
- 9వ ప్లాట్‌ఫారం: అనంతపూరం, ధర్మవరం, పుట్టపర్తి బస్సులు
- 10 నుంచి 11 వరకు: ఖమ్మం, భద్రాచలం, మణుగూరు వెళ్లే బస్సులు
- 12వ ప్లాట్‌ఫారం: సత్తుపల్లి, రాజమహేంద్రవరం, పోలవరం వెళ్లే బస్సులు
- 13వ ప్లాట్‌ఫారం: కుంట, బైలాదిల్లా, జగదల్‌పూర్ బస్సులు
- 14 నుంచి 15 వరకు: నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ బస్సులు
- 16 నుంచి 17 వరకు: గుంటూరు, నరసారావుపేట, చిలకలూరిపేట వెళ్లే బస్సులు
- 18 నుంచి 22 వరకు: యాదగిరిగుట్ట, వరంగల్
- 23వ ప్లాట్‌ఫారం: శ్రీశైలం వెళ్లే బస్సులు
- 24 నుంచి 25 వరకు: అచ్చంపేట, కల్వకుర్తి బస్సులు
- 36వ ప్లాట్‌ఫారం: రాయ్‌చూర్ బస్సులు
- 27 నుంచి 31 వరకు: మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, హుబ్లీ
- 32 నుంచి 34 వరకు: నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, షాద్‌నగర్
- 35 నుంచి 36 వరకు: విజయవాడ, తెనాలి, ఏలూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
- 37 నుంచి 38 వరకు: విజయవాడ, తెనాలి, ఏలూరు (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
- 39వ ప్లాట్‌ఫారం: విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
- 40వ ప్లాట్‌ఫారం : విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
- 41 నుంచి 42 వరకు: గద్వాల్, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
- 43 నుంచి 45 వరకు: కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (ఎపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
- 46 నుంచి 47 వరకు: మెదక్, బాన్సువాడ, బోధన్ వెళ్లే బస్సులు
- 48 నుంచి 52 వరకు: జహీరాబాద్, నారాయణఖేడ్, కరాడ్, షోలాపూర్, పుణె, ముంబయి, (టీఎస్‌ఆర్టీసీ, ఎంఎస్‌ఆర్టీసీ) బస్సులు
- 53 నుంచి 55 వరకు : సిద్దిపేట, వేములవాడ, కరీంగనర్, మంచిర్యాల, ఆసిఫాబాద్
- 56 నుంచి 58 వరకు: నిజామాబాద్, ఆదిలాబాద్, నాగ్‌పూర్, అమరావతి బస్సులు
- 59 నుంచి 61 వరకు: మంచిర్యాల, ఒంగోలు, చెన్నై బస్సులు
- 62వ ప్లాట్‌ఫారం: దేవరకొండ
- 63 నుంచి 65 వరకు: పరిగి, వికారాబాద్, తాండూరు బస్సులు
- 66 నుంచి 75 వరకు: ఎలైటింగ్ పాయింట్లు
- 76 నుంచి 79 వరకు: సిటీ సర్వీస్ బస్సులు.