ఆర్టీసీ అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్‌ కేంద్రాల్లో నగదు రహిత సేవలు | TSRTC Launches Cashless Services for Advance Ticket Booking Centres | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్‌ కేంద్రాల్లో నగదు రహిత సేవలు

Published Thu, Dec 23 2021 2:03 PM | Last Updated on Thu, Dec 23 2021 2:04 PM

TSRTC Launches Cashless Services for Advance Ticket Booking Centres - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్‌ చేసుకునే వెసులుబాటును తెలంగాణ ఆర్టీసీ కల్పించింది. నగదు రహిత, స్పర్శ రహిత లావాదేవీలను రేతిఫైల్, జేబీఎస్, సీబీఎస్, కేపీహెచ్‌బీ కేంద్రాల్లో పొందవచ్చని ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ ఈడీ వి.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆయా కేంద్రాలు ఉదయం 6.30 నుంచి రాత్రి 8.15 గంటల వరకు పని చేస్తాయన్నారు. క్యూఆర్‌ కోడ్, యూపీఐ యాప్‌ల ద్వారా స్మార్ట్‌ ఫోన్లతో అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్‌ చేసుకుని బస్‌పాస్‌ల మొత్తాలను చెల్లించవచ్చని తెలిపారు. (చదవండి: క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement