ticket advance reservation
-
ఆర్టీసీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కేంద్రాల్లో నగదు రహిత సేవలు
సాక్షి, హైదరాబాద్: దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటును తెలంగాణ ఆర్టీసీ కల్పించింది. నగదు రహిత, స్పర్శ రహిత లావాదేవీలను రేతిఫైల్, జేబీఎస్, సీబీఎస్, కేపీహెచ్‌బీ కేంద్రాల్లో పొందవచ్చని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వి.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కేంద్రాలు ఉదయం 6.30 నుంచి రాత్రి 8.15 గంటల వరకు పని చేస్తాయన్నారు. క్యూఆర్ కోడ్, యూపీఐ యాప్‌ల ద్వారా స్మార్ట్ ఫోన్లతో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకుని బస్‌పాస్‌ల మొత్తాలను చెల్లించవచ్చని తెలిపారు. (చదవండి: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు) -
బ్లాక్ టికెటింగ్‌కు ఊతం
120 రోజులు టికెట్ అడ్వాన్స్ రిజర్వేషన్‌కు గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: అడ్వాన్స్ టికెట్ బుకింగ్ విషయంలో బ్లాక్ మార్కెట్‌కు అవకాశం కల్పించేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్‌కు 60 రోజుల గరిష్ట సమయం అందుబాటులో ఉండగా దాన్ని తాజా బడ్జెట్లో మంత్రి సురేశ్ ప్రభు 120 రోజులకు పెంచారు. అంటే నాలుగు నెలల ముందే టికెట్ రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పించారన్నమాట. గతంలో కూడా 120 రోజుల ముందస్తు అవకాశం ఉండేది. కానీ దళారులు టికెట్లను ముందుగానే బ్లాక్ చేసుకుని ఎక్కువ ధరకు నల్లబజారులో విక్రయిస్తున్నట్లు తేలటంతో రెండేళ్ల క్రితం దాన్ని 60 రోజులకు కుదించారు. కానీ ప్రభు మళ్లీ 120 రోజులకు పెంచటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణ ప్రయాణికులు నాలుగు నెలల ముందు టికెట్ రిజర్వ్ చేసుకోవటం అరుదు. నెల, రెండు నెలల ముందు మా త్రమే ఎక్కువ మంది చేసుకుంటారు. దీన్ని గుర్తించే గతంలో గడువును 60 రోజు లకు కుదించారు. దీనిపై పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం కాలేదు. అయినా సురేశ్ ప్రభు దాన్ని మార్చటం విశేషం. టికెట్ బ్లాక్‌లో అమ్మేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ కొద్ది రోజుల క్రితం దక్షిణ మధ్య రైల్వే జీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాంటి దళారులపై నిఘా వేసేందుకు 10 రోజుల స్పెషల్ డ్రైవ్ కూడా మొదలు పెట్టారు. కానీ బ్లాక్ మార్కెటింగ్‌కు ఊతమిచ్చేలా ఇప్పుడు నిర్ణయం తీసుకోవటం విశేషం.