
ఆదివారం ఎంజీబీఎస్‌లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేస్తున్న మహిళా కార్మికులనుద్దేశించి మాట్లాడుతున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మండల, తాలూకా, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో మానవ హారాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎంజీబీఎస్, సిటీ పరిధిలోని బస్ డిపోల వద్ద మహిళా కండక్టర్లతో నిరసనలు చేపట్టి డిమాండ్లు పరిష్కరించి విధుల్లో చేర్చుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటంతో పాటు సమ్మెలో భాగంగా మృతి చెందిన కార్మికులకు నివాళులర్పించారు. కాగా, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 6,141 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఇందులో ఆర్టీసీ బస్సులు 4,260, అద్దె బస్సులు 1,881 ఉన్నట్లు తెలిపింది. ప్రజారవాణా ఏర్పాట్లలో ప్రయాణికుల సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది. 6,058 బస్సుల్లో టిమ్‌ల ద్వారా టికెట్లు ఇవ్వగా ,63 బస్సుల్లో మాన్యువల్ పద్ధతిలో టికెట్లు జారీ చేసినట్లు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment