హైదరాబాద్-ముంబయి కొత్త బస్సు సర్వీసు | garuda plus bus service betwwen hyderabad and mumbai | Sakshi
Sakshi News home page

హైదరాబాద్-ముంబయి కొత్త బస్సు సర్వీసు

Published Fri, Sep 23 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

హైదరాబాద్-ముంబయి కొత్త బస్సు సర్వీసు

హైదరాబాద్-ముంబయి కొత్త బస్సు సర్వీసు

హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ముంబయికి కొత్త గరుడ ప్లస్ బస్సును ప్రారంభించినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ గంగాధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్-ముంబయి (1093) బస్సు ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటలకు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్) నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 కు ముంబయి సెంట్రల్ బస్‌స్టేషన్‌కు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ముంబయి-హైదరాబాద్ (1094) సర్వీస్ సాయంత్రం 5 గంటలకు ముంబయి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుంది. చార్జీలు ఆదివారం, శుక్రవారం రూ.1500, మిగతా రోజుల్లో రూ. 1200 చొప్పున ఉంటాయని గంగాధర్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement