hyderabad-mumbai
-
త్వరలో సాకారంకానున్న హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్!
సాక్షి, హైదరాబాద్: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న బుల్లెట్ రైలు కల త్వరలో సాకారం కానుంది. హైదరాబాద్–ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడార్ అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టును నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు రూట్ సర్వే/నిర్మాణం కోసం చేపట్టిన గూగుల్ మ్యాపింగ్ తుది దశకు చేరుకుంది.వారం, 10 రోజుల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి. జీపీఎస్ ఆధారిత ఏరియల్ సర్వే కోసం ప్రస్తుతం నవీ ముంబై నుంచి హైదరాబాద్ వరకు పిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా వికారాబాద్– తాండూరు మధ్య దిమ్మెల నిర్మాణం కూడా పూర్త యింది. ఏరియల్ సర్వే నెల రోజుల్లో పూర్తి కావొ చ్చని తెలుస్తోంది. సాంకేతిక ప్రక్రియ పూర్తయిన తర్వాత హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. ‘ఈ రెండు నగరాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం పూర్తయి బుల్లెట్ రైలు పట్టాలెక్కేందుకు కనీసం 3 నుంచి నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంది’ అని ద.మ«. రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. మొత్తం 711 కిలోమీటర్ల మార్గం.. ప్రస్తుతం ముంబైలో రైల్వే టర్మినళ్లు ఎక్కువగా ఉన్న దృష్ట్యా నవీ ముంబై నుంచి హైదరాబాద్ వరకు హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తున్నారు. మొత్తం 711 కిలోమీటర్ల మార్గంలో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ పట్టాలపైన బుల్లెట్ రైలు గం టకు 320 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. మూడున్నర గంటల సమయంలోనే హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకోవచ్చు. ప్రస్తుత రైళ్లు హైద రాబాద్ నుంచి ముంబైకి చేరుకునేందుకు 13 నుంచి 14 గంటల సమయం పడుతోంది. కాగా, నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా 6 కారిడా ర్లలో 4,109 కి.మీ. మేర హైస్పీడ్ ట్రాక్‌లను నిర్మిం చనుంది. ముంబై– అహ్మ దాబాద్, ముంబై– నాసి క్– నాగ్‌పూర్, చెన్నై– బెంగళూరు– మైసూరు, ముంబై– హైదరా బాద్, ఢిల్లీ– వారణాసి, ఢిల్లీ– అహ్మదాబాద్, ఢిల్లీ– అమృత్సర్ మార్గాలు ఉన్నాయి. -
హైదరాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–ముంబై మధ్య బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ కారిడార్‌కు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి తాజాగా బిడ్లు పిలిచారు. దేశంలో హై స్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ది నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్’ఈ బిడ్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన ప్రీ బిడ్ సమావేశం నవంబర్ 5న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. నవంబర్ 11 నుంచి టెండర్ పత్రాల దాఖలు మొదలుకానుంది. నవంబర్ 17తో టెండర్ల దాఖలు గడువు ముగుస్తుంది. 18న డీపీఆర్ తయారీ సంస్థను ఎంపిక చేస్తారు. ప్రధాని మోదీ కృతనిశ్చయంతో ముందుకు.. హైదరాబాద్ నుంచి ముంబైకి పుణే మీదుగా 711 కి.మీ. నిడివితో బుల్లెట్ రైల్ కారిడార్‌ను నిర్మించేందుకు రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. దేశంలో హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కించాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే తొలి బుల్లెట్ రైల్ కారిడార్ ముంబై– అహ్మదాబాద్ మధ్య సిద్ధమవుతోంది. 459 కి.మీ. నిడివి ఉన్న ఢిల్లీ–అమృత్సర్–చండీగఢ్, 865 కి.మీ. పొడవైన ఢిల్లీ–వారణాసి, 753 కి. మీ. దూరం ఉండే ముంబై– నాగ్‌పూర్, 886 కి.మీ. తో రూపొందే ఢిల్లీ–అహ్మదాబాద్ మార్గాలను హై స్పీడ్ కారిడార్లుగా నిర్మించాలని కేంద్రం నిర్ణయిం చింది. వీటి డీపీఆర్‌ల ప్రక్రియ ప్రారంభం కావటం విశేషం. చెన్నై– మైసూరు, వారణాసి–హౌరా ప్రాజెక్టులు కూడా ఉన్నా, వాటి డీపీఆర్ ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు. ఈ ప్రక్రియ పూర్తి చేసి రెండేళ్లలో ప్రాజెక్టు పనులు ప్రారంభించే దిశగా కేంద్రం ఏర్పా ట్లు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్– నాగ్‌పూర్, హైదరాబాద్–చెన్నై సెమీ హైస్పీడ్ కారిడార్లకు సం బంధించిన ప్రతిపాదనలు పెండింగులో ఉన్నాయి. ఇందు లో రష్యా కంపెనీకి చెందిన ఇంజనీర్లు హైదరాబాద్–నాగ్‌పూర్ కారిడార్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక సమర్పించారు. అది సాధ్యమే నని అందులో స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో ఇవి పూర్తవుతాయని భావిస్తున్నారు. -
హైదరాబాద్-ముంబయి కొత్త బస్సు సర్వీసు
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ముంబయికి కొత్త గరుడ ప్లస్ బస్సును ప్రారంభించినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ గంగాధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్-ముంబయి (1093) బస్సు ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటలకు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్) నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 కు ముంబయి సెంట్రల్ బస్‌స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ముంబయి-హైదరాబాద్ (1094) సర్వీస్ సాయంత్రం 5 గంటలకు ముంబయి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుంది. చార్జీలు ఆదివారం, శుక్రవారం రూ.1500, మిగతా రోజుల్లో రూ. 1200 చొప్పున ఉంటాయని గంగాధర్ వెల్లడించారు.