మార్వలెస్‌.. మెట్రో స్టేషన్‌ | MGBS Metro Station In Bigger Than Asia Stations | Sakshi
Sakshi News home page

మార్వలెస్‌.. మెట్రో స్టేషన్‌

Published Mon, Sep 24 2018 7:56 AM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

MGBS Metro Station In Bigger Than Asia Stations - Sakshi

ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌

సాక్షి, సిటీబ్యూరో: మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు సమీపంలో నిర్మించిన మెట్రోస్టేషన్‌ ఆసియాలోనే అతిపెద్ద స్టేషన్‌ కావడం విశేషం. ఈ భారీ స్టేషన్‌ నగరవాసులకు సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఎల్బీనగర్‌–మియాపూర్‌(కారిడార్‌–1)మార్గంతోపాటు కారిడార్‌–2(జేబీఎస్‌–ఫలక్‌నుమా)మార్గాన్ని సైతం అనుసంధానించేలా నాలుగు అంతస్తుల భారీ స్టేషన్‌ను ఇక్కడ నిర్మించడం ఇంజినీరింగ్‌ అద్భుతమని హెచ్‌ఎంఆర్‌ వర్గాలు తెలిపాయి.  సోమవారం నుంచి ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌రూట్లో మెట్రో రాకపోకలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ స్టేషన్‌ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ స్టేషన్‌కు 58 ప్రధాన పిల్లర్లు, ఆరుగ్రిడ్లతో నిర్మించారు.

ఈ స్టేషన్‌ నిర్మాణానికి అత్యంత ఒత్తిడిని తట్టుకునే స్టీలు, రీయిన్‌ఫోర్స్‌డ్‌ సిమెంట్‌ కాంక్రీటును వినియోగించినట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఈస్టేషన్‌కు ఇరువైపులా ఉన్న  ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్‌ పరిసరాలను సుందరీకరించామన్నారు. కబుల్‌స్టోన్స్, తాండూర్, షాబాద్‌ రాళ్లతో పరిసరాలను తీర్చిదిద్దామన్నారు. అసెంబ్లీ–ఎంజీబీఎస్‌ మార్గంలో 5 కి.మీ మెట్రో మార్గంలో చారిత్రక,వారసత్వ కట్టడాలున్నందున వాటి ప్రత్యేకతను చాటేలా పరిసరాలను తీర్చిదిద్దామన్నారు. ఈ మార్గంలో ప్రధానంగా నాంపల్లి, ఎంజేమార్కెట్, జాంభాగ్, ఉస్మానియా మెడికల్‌ కాలేజ్, రంగమహల్‌ ప్రాంతాలున్నాయన్నారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజ్, రంగమహల్‌ ప్రాంతాల్లో అత్యధిక ఎత్తులో ఉన్న పిల్లర్లతో నిర్మిచినట్లు తెలిపారు. ఈ పిల్లర్లు, స్టేషన్ల నిర్మాణం ఎన్నో ఇంజినీరింగ్‌ అద్భుతాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఆయా స్టేషన్లను వారసత్వ కట్టడాలను తలపించేలా తీర్చిదిద్దుతామని..పర్యాటకులను ఆకర్షించే స్థాయిలో సుందరీకరిస్తామని తెలిపారు. ఈ మార్గంలో తీరైన స్ట్రీట్‌ఫర్నీచర్, చూపరులను కట్టిపడేసేలా ఉండే తీరైన ఫుట్‌పాత్‌లు,హరిత వాతావరణంతో తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement