
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని మదనపల్లిలోని అప్పారావు వీధిలో సోమవారం ఉదయం ప్రదీప్ ట్రేడర్స్ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తును మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. అగ్నిప్రమాదంతో రూ.కోట్లలో నష్టం ఉండొచ్చని పోలీసులు ప్రథమిక అంచనా వేస్తున్నారు. ఇక మదనపల్లిలో అతిపెద్ద వ్యాపార సముదాయం ప్రదీప్ ట్రేడర్స్ అన్న విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment