
కృష్ణా జిల్లా : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ ఆగిరిపల్లిలో ఆత్మహత్య చేసుకున్న బెజవాడ శ్రీనివాస రావు కుటుంబాన్ని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుతో పాటు పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రఘువీరా రెడ్డి మాట్లాడుతూ..కేంద్రంలో కసాయి ప్రభుత్వం పాలన చేస్తోంది. ప్రత్యేక హోదా రాకపోతే తన కుమారుడికి ఉద్యోగం రాదనే బాధతోనే ప్రత్యేక హోదా కోసం శ్రీనివాస రావు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.
రాష్ర్ట ప్రభుత్వం శ్రీనివాస్ కుమారుడికి పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. పార్టీ తరపున మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి రూ.25 వేల ఆర్ధిక సహాయాన్ని ప్రకటిస్తున్నట్లు రఘువీరా రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment