
సాక్షి, కృష్ణా : టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం హయంలో మంత్రిగా ఉన్న ఉమ ఇరిగేషన్‌లో వేల కోట్లు మింగేశాడని ఆరోపించారు. నిరంతరం ఆరోపణలు చేయడం ఉమకు అలావాటని విమర్శించారు. దేవినేని ఉమ నోట్లో నోరు పెడితే బురదలో రాయి వేసినట్లేనని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ పనుల్లో ఏరకంగా కమీషన్లు తీసుకున్నారో చెప్పడానికి కాంట్రాక్టర్లు రెడీగా ఉన్నారన్నారు. గత ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారో ఉమ ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రజలు బుద్ది చెప్పారని, రాబోయే రోజుల్లో మరింత గట్టిగా బుద్ది చెబుతారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment