ఓటమి భయంతో వసంత బూతు పురాణం | Vasantha Krishna Prasad Inappropriate Comments In Election Campaign | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతో వసంత బూతు పురాణం

Published Thu, May 9 2024 12:05 PM | Last Updated on Thu, May 9 2024 1:38 PM

Vasantha Krishna Prasad Inappropriate Comments In Election Campaign

    బ్లేడు బ్యాచ్, లుంగీ బ్యాచ్,  కడప రౌడీలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైనం 

    గంగిరెద్దు, కుక్కినపేను అంటూ  సర్నాలపై ఇప్పటికే అవమానకర వ్యాఖ్యలు  

    ఐదేళ్లు దేవినేని ఉమాపై  వినలేని భాషలో బూతు పురాణం 

    ఓటమి ఖాయమనే భావనతో వసంత సహనం కోల్పోతున్నారని చర్చ 

జి.కొండూరు: ఎన్నికలు దగ్గరపడే కొద్దీ టీడీపీ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్‌ సహనం కోల్పోతున్నారు. పైన పటారం.. లోన లొటారం అన్నట్లు పైకి సౌమ్యుడిగా కలరింగ్‌ ఇచ్చే వసంత, తన అసలు నైజాన్ని బయటకు ప్రదర్శిస్తున్నాడు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అతి సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓటమి భయంతో వసంత తన ఎన్నికల ప్రచారాల్లో బూతు పురాణం అందుకుంటున్నారు. గత ఐదేళ్ల పాటు తన ప్రత్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులపై సగటు మనిషి వినలేని భాషలో బూతు పురాణాన్ని వండివార్చిన వసంత, నేడు మరలా అదే తీరును కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో వసంత మాట్లాడుతున్న తీరు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

బ్లేడు బ్యాచ్‌ అంటూ...  
వసంత వెంకటకృష్ణప్రసాద్‌ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొన్ని రోజులుగా వైఎస్సార్‌ సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకి నైతికంగా మద్దతిచ్చేందుకు వచ్చిన నాయకులను బ్లేడు బ్యాచ్, లుంగీ బ్యాచ్, కడప రౌడీలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సర్నాల తిరుపతిరావుని ఉద్దేశించి గంగిరెద్దు, కుక్కిన పేను అంటూ వసంత చేసిన అవమానకర వ్యాఖ్యలు నియోజకవర్గంలో రాజకీయ దుమారాన్నే రేపాయి. ఇటీవల ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ర్యాలీలో రంగులు మార్చే ఊసరవెల్లిలా మీరు పారీ్టలు మారుస్తున్నట్ల బయట చర్చ జరుగుతోందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు వసంత మాట్లాడిన బూతు పురాణం విని పక్కనే ఉన్న ఆయన అనుచరులే విస్తుపోయారు. ఎన్నికల దగ్గర పడే కొద్దీ తిరుపతిరావుకి పెరుగుతున్న గ్రాఫ్‌తో పాటు సొంత పార్టీలో ఉన్న వర్గపోరు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డంపు చేసిన మద్యం, నగదు పట్టబడడంతో ఓటమి ఖాయమని భావించి సహనం కోల్పోతున్నాడు.  

ఏం చేస్తాడో స్పష్టత లేదు... 
మైలవరం నియోజకవర్గం నుంచి 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందిన వసంత వెంకటకృష్ణప్రసాద్‌ ప్రజలకు ఏనాడూ అందుబాటులో లేరు. ఐదేళ్లపాటు ప్రజా సమస్యలను గాలికొదిలేసిన వసంత, నేడు మరలా పార్టీ మార్చి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతూ నియోజకవర్గానికి తానేమి చేస్తాడో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నిత్యం వైఎస్సార్‌ సీపీ నాయకులు, సర్నాల తిరుపతిరావు, ముఖ్యమంత్రిపై బూతులు మాట్లాడటం మినహా ఎటువంటి హామీలను ఇవ్వలేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వసంత మాట్లాడుతున్న బూతు పురాణం వింటున్న స్థానిక ప్రజలే కాకుండా ఆయన పక్కన ఉంటున్న సొంత పార్టీ నేతలు సైతం ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement