సాక్షి, మైలవరం : మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మైలవరం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ విమర్శలు గుప్పించారు. దేవినేని ఉమ దిగజారుడుతనంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటున్న వెంకట రామారావు అనే వ్యక్తి ఆందోళన చేశాడని పోలీసులు కేసు పెట్టారు. ఇదేంటని ప్రశ్నిస్తే ప్రలోభాలకు గురిచేశారని మరో కేసు పెట్టారు. పోలీసులు మాపై తప్పుడు కేసులు పెడుతున్నారనడానికి ఇదే నిదర్శనం. పోలీసులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మంత్రికి వత్తాసు పలికి తమ కర్తవ్యాన్ని విస్మరించకూడదు. నిజంగా మేం డబ్బులిచ్చి పోలీసులను ప్రలోభాలకు గురిచేసినట్టయితే సీసీటీవీ ఫుటేజీలు బయటపెట్టాలి’ అని కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. ('మంత్రి చేతుల్లో పోలీసులు పావులుగా మారారు')
Comments
Please login to add a commentAdd a comment