mailavaram
-
సామాన్యుడిపై నమ్మకం...మైలవరం మొనగాడు
-
పంచ్ డైలాగ్స్ తో టీడీపీకి ఝలక్ ఇస్తున్న కేశినేని నాని..!
-
మంత్రి పెద్దిరెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదు: ఎమ్మెల్యే వసంత
-
దేవినేని ఉమా డ్రామాలాడుతున్నారు: వసంత కృష్ణ ప్రసాద్
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డ్రామాలాడుతున్నాడని మైలవరం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా వల్లే అనర్థాలు జరిగాయని మండిపడ్డారు. దేవినేని ఉమా అధికారంలో ఉన్నప్పుడు రెవిన్యూ భూములని, ఇప్పుడు ఫారెస్ట్ భూములని ఆరోపిస్తున్నాడాని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలని ఉమా చూస్తున్నాడని దుయ్యబట్టారు. దేవినేని ఉమా దౌర్జన్యాలు, డ్రామాలు అందరికీ కనిపిస్తున్నాయన్నారు. ‘ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నాడు. దేవినేని ఉమాను ప్రశ్నిస్తే దాడి అంటాడు. తూర్పు, పడమర తెలియని వ్యక్తి లోకేష్. ఉమా వెకిలి చేష్టలతో టీడీపీ కార్యకర్తలే విసిగిపోయి ఎదురుతిరుగుతున్నారు. తెలుగు దేశం పార్టీ కాదు.. పక్కా తెలుగు దొంగల పార్టీ. 2014 నుంచి ఎలా క్వారీ జరిగిందో అన్నీ లెక్కలు తీస్తాం. అక్రమ మైనింగ్ చేసిందెవరో నిగ్గు తేల్చి ప్రజల ముందుపెడతాం’ అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. -
సోలార్ ప్రాజెక్టులో గొడ్డళ్లతో విధ్వంసం
సాక్షి, జమ్మలమడుగు/మైలవరం(కడప) : మైలవరం మండల పరిధిలోని పొన్నంపల్లి, రామచంద్రాయపల్లి తది తర ప్రాంతాల పరిధిలో ఉన్న సోలార్ ప్రాజెక్టులో ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు ప్రాజెక్టులో ఉన్న దాదాపు 1719 సోలార్ మాడ్యుల్స్‌ను గొడ్డళ్లతో పగులగొట్టారు. సోమవారం తెల్లవారు జామున సోలార్ అధికారులు విషయాన్ని తెలుసుకున్నారు. రూ. 3 కోట్ల నష్టం.. ఐదువేల ఎకరాల్లో రూ.6వేల కోట్లతో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. అందులో మొదటి విడత కింద రూ.1500 కోట్లతో 250 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మొదటి దశ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో ఎవరూ లేని సమయంలో దుండగులు1719 సోలార్కు సంబంధించిన మాడ్యుల్స్ పగులగొట్టినట్లు కంపెనీ యాజమాన్యం గుర్తించింది. పగుల కొట్టిన మాడ్యుల్స్ విలువ దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ మేరకు మైలవరం పోలీసు స్టేషన్లో ఎస్ఐ పెద్దినేని ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షతోనేనా.! సోలార్ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గతంలో టీడీపీకి చెందిన నాయకులు సోలార్ ప్లాంట్‌లో పనులు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో కంపెనీ యాజమాన్యం కొందరిని తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో వారు కక్ష గట్టి సోలార్ మాడ్యుల్స్‌ను పగులగొట్టారనే వాదన స్థానిక అధికారులు, కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది నుంచి వినిపిస్తోంది. -
మైలవరం వివాదంలో ఎస్ఐలే దోషులు..
సాక్షి, విజయవాడ : అధికారం ఉంది కదా.. మనకు అడ్డెవరు అనుకున్న టీడీపీ నేతలు బొక్కబోర్లాపడ్డారు. స్థానిక పోలీసులతో చేతులు కలిపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బుందులకు గురిచేయాలనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. కొద్ది రోజుల క్రితం మైలవరంలో రాజుకున్న రాజకీయ వివాదాన్ని జిల్లా ఎస్పీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ముగింపు పలికారు. ఎన్నికల్లో తమకు సహకరించాలంటూ నియోజకవర్గంలోని పోలీసులకు వైఎస్సార్ సీపీ నేతలు డబ్బులు ఇవ్వజూపారనే ఆరోపణ అవాస్తమని పోలీసు ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ ఎస్ఐలకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని, అవన్నీ అసత్య ఆరోపణలని స్పష్టం చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసిన జి.కొండూరు ఎస్ఐ అస్ఫక్, మైలవరం ఎస్ఐ శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ వీఆర్‌లోకి పంపించారు. అసలేం జరిగిందంటే.. తమకు కవర్లలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ వైఎస్సార్ సీపీ నాయకులపై స్థానిక పోలీసులు తప్పుడు కేసులు బనాయించారు. తమపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒత్తిడితో పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. మైలవరం సీఐ, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టేందుకు వైఎస్సార్సీపీ నేతలు సన్నాహాలు చేపట్టాయి. దీనికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు కూడా ధర్నా చేయాలంటూ మంత్రి దేవినేని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో వైఎస్సార్సీపీ ధర్నాను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో దీనిపై పోలీసులు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. -
మైలవరం వివాదంలో ఎస్ఐలే దోషులు..
-
‘సర్జరీ అవుతున్న వ్యక్తి ఆందోళన చేశాడా’
సాక్షి, మైలవరం : మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మైలవరం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ విమర్శలు గుప్పించారు. దేవినేని ఉమ దిగజారుడుతనంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటున్న వెంకట రామారావు అనే వ్యక్తి ఆందోళన చేశాడని పోలీసులు కేసు పెట్టారు. ఇదేంటని ప్రశ్నిస్తే ప్రలోభాలకు గురిచేశారని మరో కేసు పెట్టారు. పోలీసులు మాపై తప్పుడు కేసులు పెడుతున్నారనడానికి ఇదే నిదర్శనం. పోలీసులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మంత్రికి వత్తాసు పలికి తమ కర్తవ్యాన్ని విస్మరించకూడదు. నిజంగా మేం డబ్బులిచ్చి పోలీసులను ప్రలోభాలకు గురిచేసినట్టయితే సీసీటీవీ ఫుటేజీలు బయటపెట్టాలి’ అని కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. ('మంత్రి చేతుల్లో పోలీసులు పావులుగా మారారు') -
మైలవరం పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత
-
మైలవరం పీఎస్ వద్ద ఉద్రికత్త
సాక్షి, విజయవాడ : మైలవరం పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒత్తిడితో పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ మండిపడ్డారు. మైలవరం సీఐ, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టేందుకు వైఎస్సార్సీపీ నేతలు సన్నాహాలు చేపట్టాయి. దీనికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు కూడా ధర్నా చేయాలంటూ మంత్రి దేవినేని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో వైఎస్సార్సీపీ ధర్నాను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. సీఐ, ఎస్ఐ నమోదు చేసిన తప్పుడు కేసులు బటయపడతాయని మంత్రి ఆందోళన చెందుతున్నారని కృష్ణప్రసాద్ విమర్శించారు. ('మంత్రి చేతుల్లో పోలీసులు పావులుగా మారారు') మంత్రి దేవినేని ఉమ, ఆయన అనుచరుల కలప స్మగ్లింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశామనే కక్షతో సదరు సీఐ తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని వసంత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు. పోలీసులకు కవర్లలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ తప్పుడు కేసులు పెట్టారని నిప్పులు చెరిగారు. దమ్ముంటే పోలీసులు తమ వద్ద ఉన్న సీసీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. -
'మంత్రి చేతుల్లో పోలీసులు పావులుగా మారారు'
సాక్షి, విజయవాడ : మైలవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలీసులను ప్రయోగించి వేధింపులకు పాల్పడుతున్నారని మైలవరం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ అన్నారు. మంత్రి దేవినేని ద్వారా మైలవరం సీఐ పోస్టింగ్ తెచ్చుకున్న సంగతి అందరికి తెలుసన్నారు. ఆ కృతజ్ఞతతో ప్రతిచోటా వైఎస్సార్సీపీ నేతలపై సదరు సీఐ తప్పుడు కేసులు నమోదు చేస్తున్నాడని మండిపడ్డారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. మంత్రి దేవినేని ఉమ, ఆయన అనుచరుల కలప స్మగ్లింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశామనే కక్షతో సదరు సీఐ తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని వసంత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు.పోలీసులకు కవర్లలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ తప్పుడు కేసులు పెట్టారని నిప్పులు చెరిగారు. దమ్ముంటే పోలీసులు తమ వద్ద ఉన్న సీసీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తాము ఏ పోలీసు అధికారిని డబ్బు కవర్లతో ప్రలోభ పెట్టలేదన్నారు. మంత్రి దేవినేని ఉమ చేతుల్లో పోలీసులు పావులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక దేవినేని తనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మైలవరం సీఐని తమపై ప్రయోగించారన్నారు. ఎల్లో మీడియాలో తమపై అసత్య ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. -
మైలవరం సిఐ టీడీపీ ఏజెంట్
-
ఏసీసీ బాధితులను ఆదుకుంటాం
మైలవరం : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోనికి రా గానే ఏసీసీ బాధితులను ఆదుకుంటామని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైలా నరసింహా, వద్దిరాల రామాంజనేయుల యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీఎంపీ మాట్లాడుతూ 23 సంవత్సరాల నుంచి ఏసీసీ బాధితులు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. స్థానిక నాయకులు మోసపూరిత మాటలు నమ్మి రైతులు ఆర్థికంగా నష్టపోయారన్నారు. 2016 నవంబర్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులో మంత్రి ఆదినారాయణ రెడ్డి రైతులకిచ్చిన హామీ ఇంత వరకు నిలబెట్టుకోకపోవడం దురదృష్ణకరమన్నారు.వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు మాట్లాడుతూ ఏసీసీ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రజలు గళమెత్తితే వారిపై అక్రమ కేసులను ఆదినారాయణరెడ్డి పెట్టించారన్నారు. తన అనుచరులపై ఎటువంటి కేసులు లేకుండా కేవలం వైఎస్సార్సీపీ మద్దతు దారులపైనే పెట్టించారన్నారు. డాక్టర్ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ మైలవరం మండలంలో ఏసీసీ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములను తాము అధికారంలోకి వచ్చి న వెంటనే తిరిగి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలో గొల్లపల్లె గ్రామానికి 110 ఇళ్లు మంజూరు చేశారని భూములు లేని నిరుపేదల కు 400 ఎకరాల భూపంపిణీ చేశారన్నారు.ప్రస్తుతం గ్రామంలో ఏడు ఇళ్లు మంజూరయ్యాయని, నాలుగేళ్లలో ఒక్క సెంటు భూమి కూడా పేదలకు టీడీపీ ప్రభుత్వం పంపిణి చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మైసూరారెడ్డి తనయుడు హర్షవర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు జయరామకృష్ణారెడ్డి, మహేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి హనుమంతరెడ్డి, సిం గిల్‌విండో అధ్యక్షుడు శివగుర్విరెడ్డి, మాజీ సర్పంచ్‌శంకర్, గురుమూర్తి యాదవ్,యువజన నాయకుడు పోచిరెడ్డి, శివ, వెంకటరాముడు, శ్రీధర్‌రెడ్డి, వినయ్, బాబుల్‌రెడ్డి,నాగేంద్ర, చిన్నగైబు బాష,రామమోహన్‌రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిక... గొల్లపల్లె గ్రామానికి చెందిన 45 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. లక్ష్మీనారాయణ సోమశేఖర్, శివకేశవులు సుబ్బనర్సయ్య, చిన్నరామయ్య జోసఫ్, మత్తయ్య, శ్రీనివాసులు,బాబు, చిన్నవెంకటసుబ్బయ్య, శ్రీరాములు సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ వైఎస్ ఆవినాష్‌రెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్‌బాబు సమక్షంలో పార్టీతీర్థం పుచ్చుకున్నారు. -
రాజకీయ ఊసరవెల్లి..
సాక్షి, విజయవాడ : నాడు వైఎస్సార్సీపీని స్థాపించడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలుకు పంపించాయని ఆయన ఆరోపించారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చంద్రబాబు అభినందించటమే అందుకు నిదర్శనమన్నారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు తనపై ఉన్న కేసుల విషయంలో మాత్రం కాంగ్రెస్ నాయకుల కాళ్లు పట్టుకుని స్టేలు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. మైలవరం పట్టణంలో గురువారం వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో వైఎస్సార్సీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ‘వైఎస్ జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ చంద్రబాబే ముఖ్య కారణం. పైకి తేనె పూతలాగా ఉంటూ, లోపల మాత్రం తేనె పూసిన కత్తిలా ఏపీ సీఎం ఉంటాడు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే అప్పుడు చంద్రబాబే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా కాపాడారు. కాంగ్రెస్ పార్టీ మా ప్రథమ శత్రువు అని చెప్పుకునే చంద్రబాబు నిన్న కర్ణాటకలో చేసిందేమిటి. చంద్రబాబు ఎప్పుడూ చెప్పేదొకటి, చేసేది మరొకటి.ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దివంగత నేత ఎన్టీఆర్ పార్టీ పెడితే, పార్టీ సిద్దాంతాలకు చంద్రబాబు తూట్లు పొడిచారు. చంద్రబాబు నయవంచకుడని ఎన్టీఆర్ అప్పుడే చెప్పారు. కుట్ర రాజకీయాలకు చంద్రబాబే నాయకుడు. నేడు వైఎస్ జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి చంద్రబాబుకు పిచ్చెక్కుతోంది. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. జననేత జగన్ నిఖార్సయిన వ్యక్తి, విలువలతో కూడిన పోరాటం చేసే వ్యక్తి అని’ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ నేతలు వసంత కృష్ణప్రసాద్, సామినేని ఉదయభాను, జోగి రమేష్, మెండితోక జగన్మోహన్రావు, పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. -
వైఎస్ జగన్‌కు పవిత్ర జమ్ జమ్ను అందజేసిన ఎన్ఆర్ఐ
సాక్షి, మైలవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ.. గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన ముస్లిం మైనార్టీ సభ్యులు పవిత్ర మక్కాలో పార్థనలు చేసి తమతో పాటు తెచ్చిన పవిత్ర ‘జమ్ జమ్’ నీళ్లను వైఎస్ జగన్‌కు అందజేశారు. మంగళవారం మైలవరంలో వైఎస్ జగన్‌ను కలిసిన ఎన్ఆర్ఐ షేక్ సలీం సౌదీ నుంచి తెచ్చిన మదీనా చిత్ర పటాన్ని, ఖర్జురా పళ్లను ఆయనకు బహుకరించారు. సలీం సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ.. మా జననేతను కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే తాను సోషల్ మీడియాలో పార్టీ కోసం పని చేస్తున్నానని జగన్ గారికి తెలిపినట్టు, దానికి ఆయన అభినందించినట్టు పేర్కొన్నారు. ‘ఆప్ డరో మత్, మై ఆప్ కే సాత్ హై సమ్జో’ ( మీరు ఏం భయపడకండి, మీకు తోడుగా నేనున్నాను) అంటూ ఉర్దులో జగన్ గారు తమకు భరోసా ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమురు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగు నాగార్జున, భట్టిప్రోలు మండల మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, గ్రామ అధ్యక్షులు మహ్మద్ జాని, సయ్యద్ నబి, మహ్మద్ అల్తాఫ్, పఠాన్ జాని, ఇర్షాద్ లు పాల్గొన్నారు. -
చంద్రబాబు దీక్ష ‘420’ దీక్ష కాదా?
-
చంద్రబాబుది ఫోర్ ట్వంటీ దీక్ష కాదా: వైఎస్ జగన్
సాక్షి, మైలవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాలుగో నెల 20వ తేదీ అని, దీనిని ఇంగ్లిష్‌లో ఫోర్ ట్వంటీ అంటారని, అదే రోజున ఆయన ‘420’ దీక్ష చేయబోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన పుట్టినరోజున ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా మైలవరం బహిరంగ సభలో ప్రసంగించిన వైఎస్ జగన్ చంద్రబాబు దీక్ష గురించి ప్రస్తావించారు. ప్రత్యేక హోదా కోసం ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసి.. నిరాహార దీక్ష చేశారని, ఆ రోజునే టీడీపీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించి ఉంటే.. మొత్తం ఏపీకి చెందిన 25మంది ఎంపీలు రాజీనామా చేసి.. పార్లమెంటు నుంచి నేరుగా వెళ్లి ఏపీ భవన్లో నిరాహార దీక్ష చేసి ఉండి ఉంటే.. దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరిగేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని వైఎస్ జగన్ అన్నారు. ఆ రోజు తన ఎంపీలతో రాజీనామాలు, నిరాహార దీక్ష చేయించని చంద్రబాబు ఈ రోజు 420 రోజున కొంగజపం చేస్తారట అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే దీక్ష ఫోర్ ట్వంటీ దీక్ష కాదా? అని నిలదీశారు. ప్రత్యేక హోదాను చంద్రబాబే నీరుగార్చారని, వేరొకరు సీఎంగా ఉండి ఉంటే హోదా నడుచుకుంటూ వచ్చేదని అన్నారు. చంద్రబాబులాంటి వ్యక్తిని రాష్ట్రం నుంచి తరిమికొట్టి.. రాజకీయాల్లోకి నిజాయితీ, విశ్వసనీయతను తీసుకురావాలని, ఇందుకోసం మీ అందరి మద్దతు, ఆశీస్సులు కావాలని వైఎస్ జగన్ ప్రజలను కోరారు. అందరి జీవితాల్లోనూ సంతోషం నింపుతాం మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలను అమల్లోకి తీసుకొస్తామని, ఈ పథకంతో అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతామని వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్ హయాంలో మండలానికో అంబులెన్స్ ఉండేది కానీ, ఇప్పుడు నియోజకవర్గానికి రెండు అంబులెన్స్‌లు మాత్రమే ఉన్నాయని, అంబులెన్సుల సిబ్బందికి కూడా గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఆరోగ్య శ్రీ పథకం పరిస్థితి దారుణంగా తయరైందని అన్నారు. హైదరాబాద్‌లో ఆపరేషన్ చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదంటూ చంద్రబాబు ప్రభుత్వం అమానుషమైన నిబంధనలు తెచ్చిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకొనేవిధంగా వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. కుటుంబపెద్ద ఆపరేషన్ చేయించుకున్నాక విశ్రాంతి అవసరమైతే.. ఆ సమయంలో రోగులకు ఆర్థికసాయం చేస్తామని చెప్పారు. డయాలసిస్, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెల రూ. 10వేల పింఛన్ ఇస్తామని తెలిపారు. -
అన్యాయపు దర్బారులో అవినీతి మంత్రి ఉమా!
సాక్షి, మైలవరం: అన్యాయపు రాజుగారి దర్బారులో అవినీతి మంత్రి దేవినేని ఉమా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ముడుపులు ఎంత రావాలో నిర్ణయిస్తే.. వాటిని మూటలు గట్టి ఆయనకు చేర్చి అందులో వాటాలు తీసుకునేవారిలో ఈ మంత్రి ఒకరని నిప్పులు చెరిగారు. ఈ ఇద్దరు చేసిన అవినీతి అంతా ఇంతా కాదని, పట్టిసీమ నుంచి పోలవరం వరకు లాంచాలే లంచాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకురన్నారని ధ్వజమెత్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా మైలవరంలో మంగళవారం జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. పట్టిసీమ, పోలవరం, రాజధాని భూములు, ఇసుక మాఫియా.. ఇలా అన్నింటిలోనూ చంద్రబాబు, ఉమా అడ్డంగా దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకునేందుకే ఏకంగా 23, 62 జీవోలను తీసుకొచ్చారని, ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్ ఇవ్వడానికి అనుమతి లేకున్నా.. వారికి ఎస్కలేషన్ ఇచ్చి.. అందులో కమీషన్ దోచుకోవడానికి ఈ జీవోలు తీసుకొచ్చారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇదివరకే చేసిన పనులకు కూడా ఈ జీవోలను వర్తింపజేసి అడ్డంగా దోచుకున్నారని తెలిపారు. పట్టిసీమలో అడ్డంగా దోచేశారని కాగ్ నివేదికలు ఇచ్చినా.. నాకేంటి సిగ్గు అన్నట్టుగా చంద్రబాబు, మంత్రి ఉమా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కళ్లెదుటే లక్షల టన్నుల ఇసుక దోచేస్తున్నారని, సాక్షాత్తూ సీఎం చంద్రబాబే కృష్ణానది ఒడ్డున ఉన్న అక్రమ కట్టడంలో నివసిస్తున్నారని, ఆయన ఇంటిపక్కన కళ్ల ఎదుటనే ఇసుకను ఇష్టానుసారంగా దోచేస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదంటే.. అవినీతి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోందని వైఎస్ జగన్ అన్నారు. ఎమ్మెల్యేల నుంచి కలెక్టర్ల వరకు.. కలెక్టర్ల నుంచి మంత్రుల వరకు, మంత్రుల నుంచి చినబాబు వరకు, చినబాబు నుంచి పెద్ద పెదబాబు వరకు లంచాలే, లంచాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. టూరిజం పేరుతో లైసెన్సులు లేని బోట్లను తిప్పి 23 మంది ప్రయాణికుల మరణించారని, అయినా చంద్రబాబు మాత్రం బాధ్యులపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాజధాని ప్రాంతం నాగార్జున యూనివర్సిటీ పరిసరాల్లో వస్తుందని చెప్పి.. చివరకు తుళ్లూరు ప్రాంతంలో రైతుల నుంచి కారుచౌక ధరకు చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కొనుగోలు చేశారని, రైతులను మోసగించి చంద్రబాబు, ఆయన బినామీలు చేసిన పనికి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు పెట్టాలని మండిపడ్డారు. తాను, తన బినామీలు కొనుగోలు చేసిన భూములకు ఎక్కువ ధర రావాలని, వాటిని రియల్ ఎస్టేట్ జోన్లో పెట్టారని, మిగతా భూములను మాత్రం వ్యవసాయ జోన్లలో పెట్టి.. రైతులను తీవ్రంగా మోసం చేశారని, దీంతో రాజధాని రైతులు అష్టకష్టాలు పడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానది పక్కనే ఉన్నా మైలవరం నియోజకవర్గంలో తాగడానికి నీళ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఇందుకు నీటిపారుదల శాఖ మంత్రి సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లభించలేదని, ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. చంద్రబాబే దళారి కావడం వల్లే.. ఆయనకు హెరిటేజ్ షాపులు ఉండటం వల్లే రైతులకు గిట్టుబాటు రావడం లేదని, రైతుల పండించిన పంటలను తక్కువ ధరకు కొనుగోలుచేసి.. వాటినే మళ్లీ ప్యాక్ చేసి.. మూడింతలు, నాలుగింత ధరకు అమ్ముకుంటున్న వ్యక్తి సాక్షాత్తు మన సీఎం కాదా అని నిలదీశారు. ముఖ్యమంత్రే దళారి కావడంతో రైతులు గిట్టుబాటు ధర రాక తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
మైలవరంలో అక్రమ రేషన్
మైలవరం : కృష్ణా జిల్లా మైలవరం మండలం తుళ్లూరులోని ఏఎంసీ చెక్‌పోస్టు వద్ద 17 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఏపీ37 డబ్ల్యు0699 అనే నెంబర్ గల లారీలో ఖమ్మం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు రేషన్ ను తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టుకోమని ఇస్తే.. పట్టుకుపోయింది!
పసిగుడ్డుతో మహిళ పరారీ పోలీసులకు ఫిర్యాదుచేసిన తల్లి మైలవరం: టాయ్‌లెట్‌కు వెళ్లి వస్తాను బిడ్డను పట్టుకోమని యిస్తే సదరు మహిళ బిడ్డతో పాటు మాయమైన ఘటన మైలవరం బస్టాండ్‌లో మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన బాణావతు సంధ్య స్థానికంగా వున్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చింది. ఆస్పత్రిలో చూపించుకుని తిరిగి రుద్రవరం వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్‌లోకి వచ్చింది. ఈ లోగా టాయ్‌లెట్‌కు వెళ్లే అవసరం రావడంతో పక్కనే వున్న తమ వర్గానికి చెందిన గిరిజన మహిళకు తన మూడు నెలల మగ బిడ్డను అప్పగించి వెళ్లింది. టాయ్‌లెట్ నుంచి తిరిగి వచ్చేసరికి బిడ్డతో పాటు మహిళ మాయమైంది. వెంటనే బాధితురాలు ఇంటికి వెళ్లి బంధువులకు సమాచారమివ్వడంతో వారు హుటాహుటిన మైలవరం చేరుకుని అన్నిచోట్ల పసికందును తీసుకుపోయిన మహిళ కోసం వెదికి, ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూజివీడు డిఎస్పీ వెంకటరమణ, మైలవరం సీఐ వెంకటరమణ బాధితురాలిని, కుటుంబ సభ్యులను పిలిచి వివరాలు సేకరిస్తున్నారు. -
శివ స్వాముల వాహనం బోల్తా
మైలవరం (కృష్ణా), భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: కృష్ణా జిల్లాలోని మైలవరం పట్టణ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో భద్రాచలానికి చెందిన ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రంగా, ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. పదిమంది శివ స్వాములు భద్రాచలం నుంచి క్వాలిస్ వాహనంలో శ్రీశైలం వెళుతున్నారు. మైలవరం శివారులోని దర్గా సమీపంలో ఈ వాహనం వెనుక టైర్ పేలిపోయింది. దీంతో వాహనం అదుపు తప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన నీరు లేని పంట కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో భద్రాచలం మండలంలోని తుమ్మల నగర్ గ్రామానికి చెందిన అపకా రామారావు(30) మృతిచెందారు. సిహెచ్.శోభన్‌బాబు, డి.దేవదాస్, డి.వినోద్, ఎం.విశ్వనాథ్, డి.మల్లేశ్వరమ్మ, పి.అన్నపూర్ణకు బలమైన గాయాలయ్యాయి. కె.అక్కయ్య, డి.శ్రీకాంత్, కె.మురళి స్వల్పంగా గాయపడ్డారు. వీరిని 108 సిబ్బంది స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన శోభన్‌బాబు, దేవదాస్, వినోద్, విశ్వనాథ్, మల్లేశ్వరమ్మ, అన్నపూర్ణను ప్రాథమిక చికిత్స అనంతరం 108 లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వాహనాన్ని డ్రైవర్ అతి వేగంగా నడిపినందునే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. శివయ్య దర్శనానికి వెళ్లొస్తానని... కానరాని లోకాలకు... ‘శ్రీశైలం శివయ్య దర్శనానికి వెళ్లొస్తా..’నంటూ ఇంట్లో చెప్పి బయల్దేరిన కొద్ది గంటల్లోనే అపకా రామారావును రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. శివమాల వేసుకుని శ్రీశైలం బయలుదేరేముందు జరిగిన ఇరుముడి కార్యక్రమంలో అతనితో గడిపిన క్షణాలే ఆ కుటుంబానికి చివరి జ్ఞాపకాలయ్యాయి. రామారావు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని స్వగ్రామం గొమ్ముకొత్తగూడెం. డిగ్రీ అనంతరం కొత్తనారాయణపురం గ్రామానికి చెందిన నాగమణితో వివాహమైంది. ఆ ఊరు పక్కనున్న తుమ్మల నగర్లో పూరి గుడిసెలో భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శివమాల వేసుకోవడంతో... తాను కూడా శివమాల ధరించి నిష్టగా మాలధారణ పూర్తిచేశాడు. శ్రీశైలం వెళ్లేందుకుగాను ఇరుముడి కార్యక్రమం శుక్రవారం తెల్లవారుజామున స్థానిక శివాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రామారావు తన భార్యాపిల్లలతో, బంధువులతో ఆనందంగా గడిపాడు. ‘శివయ్య వద్దకు వెళ్లొస్తా..’నని బయల్దేరాడు. ప్రమాదం జరిగిందని మిగిలిన స్వాముల నుంచి ఫోన్ రావడంతో రామారావు కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. రామారావు తండ్రి, భార్య, బావమరిది కలిసి మైలవరం వెళ్లారు. రామారావు ఇంటి వద్ద అమాయకంగా చూస్తున్న అతని పిల్లలు తేజ(8), సాయిరాం(6) చూసి బంధువులు రోదిస్తున్నారు. రెక్కల కష్టం మినహా మరెలాంటి ఆదరువూ లేని తమ్ముడి కుటుంబానికి దిక్కెవరంటూ అతని అక్క, బంధువులు రోదిస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శోభన్‌కు టెంట్ హౌస్ ఉంది. దేవదాసు టైలర్‌గా పనిచేస్తున్నాడు.