Vasanta krishna Prasad
-
నాసిరకం రోడ్లేసి నిందలా?
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో రహదారుల దుస్థితికి చంద్రబాబు సర్కారు నిర్వాకాలే కారణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. గత సర్కారు చివరి రెండేళ్ల పాటు రహదారుల నిర్వహణ, మరమ్మతులను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా రోడ్ల గురించి పట్టించుకోకుండా నాసిరకం పనులతో సరిపుచ్చి ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు టీడీపీ నేతలు ఆర్టీఐ సమాచారం అంటూ మభ్యపుచ్చే యత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలివీ.. టెండర్ల ప్రక్రియ దాదాపుగా పూర్తి టీడీపీ హయాంలో ఐదేళ్లలో కొత్తగా 1,356 కి.మీ తారు రోడ్ల నిర్మాణం మాత్రమే జరిగింది. ఏటా సగటున 271.2 కి.మీ. రోడ్లు వేశారు. రహదారుల విస్తరణ, మరమ్మతులు 8,917 కి.మీ చేసినట్లు చెబుతున్నారు. అంటే ఏటా సగటున 1,783 కి.మీ మాత్రమే పనులు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లలోనే కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా 1,883 కి.మీ తారు (బీటీ) రోడ్ల నిర్మాణం జరిగింది. ఏటా సగటున దాదాపు 942 కి.మీ కొత్త రహదారులు నిర్మించాం. దీంతోపాటు రెండేళ్లలోనే 4,015 కి.మీ మేర రహదారుల విస్తరణ, అభివృద్ధి, మరమ్మతులు జరిగాయి. ఏటా సగటున 2 వేల కి.మీ పైగా రహదారుల అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వ హయాంలో జరిగాయి. మరోవైపు రూ.7,828 కోట్లతో 9,557 కి.మీ. రహదారులకు సంబంధించిన పనులు మంజూరు చేసి చేపట్టబోతున్నాం. టెండర్ల ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయింది. వర్షాకాలంలో పనులు ప్రారంభిస్తే నాణ్యత దెబ్బ తింటుందనే ఉద్దేశంతో తగ్గుముఖం పట్టగానే ప్రారంభించాలని నిర్ణయించాం. చంద్రబాబు హయాంలో తీవ్ర దుర్భిక్షంతో రాష్ట్రం అల్లాడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సకాలంలో వర్షాలతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. వర్షాల కారణంగా కొన్నిచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. కరోనా వల్ల మరమ్మతుల పనులు కొంత నిదానంగా జరుగుతున్నాయి. పెద్దిరెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేతలు వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన స్థాయి గురించి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ సీఎంలను ఎవరిని అడిగినా చెబుతారు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టి సీఎంలను సైతం ఢీకొట్టి ఎదుర్కొన్న మొనగాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన గురించి మాట్లాడే స్థాయి కానీ, అర్హతగానీ టీడీపీ నేతల్లో ఎవరికీ లేదు. చంద్రబాబు, లోకేశ్ మంచి పనులు చేస్తే ఆ పార్టీ 23 స్థానాలకే ఎందుకు పరిమితమైంది? ఏ ఒక్క హామీని అమలు చేయలేదు కాబట్టే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. చదవండి: మతాల మధ్య సోము వీర్రాజు చిచ్చు: వెల్లంపల్లి -
మంత్రి పెద్దిరెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదు: ఎమ్మెల్యే వసంత
సాక్షి, మైలవరం: వర్షాలు ఆగగానే రోడ్ల మరమ్మతులు, నిర్మాణం చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా పనీపాటా లేని టీడీపీ నాయకులు మాట్లాడడం తగదని మైలవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. టీడీపీ జూలో రకరకాల జంతువులతో ఏదేదో మాట్లాడిస్తున్నాడు అని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఓ పందికొక్కు విమర్శలు చేస్తోందని ఎద్దేవా చేశారు. ఈ రెండేళ్లలో 1,883 కిలోమీటర్ల తారు రోడ్ల నిర్మాణం జరిగిందని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తెలిపారు. టెండర్లు పూర్తయ్యాయని.. అయితే వర్షాకాలంతో పనులు ప్రారంభం కాలేదని చెప్పారు. టీడీపీ హయాంలో రోడ్లు వేసి ఉంటే ఈ రెండున్నర ఏళ్లలోనే ఇంత పెద్ద గుంతలు పడ్డాయా? అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి స్థాయి ఏమిటో మీ నాయకుడికి బాగా తెలుసు ఆయన గురించి మాట్లాడే స్థాయి, అర్హత టీడీపీలోని వారెవ్వరికీ లేదని స్పష్టం చేశారు. అలా మాట్లాడిస్తే నీ స్థాయే దిగజారుతుందనేది చంద్రబాబు గుర్తించాలని హితవు పలికారు. రోడ్లు బాగున్నాయని మేము చెప్పడం లేదు.. కానీ కరోనాతో టెండర్లు సకాలంలో పూర్తి కాలేదని తెలిపారు. దీంతోపాటు వర్షాకాలంతో పనులు ప్రారంభం కాలేదని వివరించారు. రూ.7,500 కోట్లతో రహదారులను ఏడాదిలో పూర్తి చేస్తామని అప్పటి పంచాయతీరాజ్ మంత్రిగా చెందిన ప్రబుద్ధుడి వల్లే ఈ గోతులు పడ్డాయని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ చెప్పారు. -
‘టీడీపీ నిజ నిర్ధారణ కమిటీతో పాటు మేమూ వస్తాం.. సిద్ధమేనా’
సాక్షి, తాడేపల్లి: ‘దళితులపై దాడి చేసిన దేవినేని ఉమ ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్లారు.. దళితులపై దాడి వెనక చంద్రబాబు పాత్ర ఉంది’ అని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెరుగు నాగార్జున మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు మరోసారి దళిత ద్రోహి అని నిరూపించుకున్నారు. దళితులపై దాడి చేసిన దేవినేని ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్లారు. దళితులపై దాడి వెనక చంద్రబాబు పాత్ర కూడా ఉంది’’ అని ఆరోపించారు. మరో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘దేవినేని అబద్ధాలను నిజం చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకే చంద్రబాబు గొల్లపల్లి వచ్చారు. 2004లో వసంత నాగేశ్వరరావు కారును దగ్ధం చేసింది గుర్తులేదా. 2016 డిసెంబర్ 4న 143 సర్వే నంబర్లో దేవినేని మైనింగ్ ప్రారంభించారు.. అవి అసలు రెవిన్యూ భూములా.. ఫారెస్ట్ భూములా అనే విషయం తేల్చాలి. 2018లో దేవినేని ఉమా క్రషర్ ప్రారంభించారో లేదో చెప్పాలి. దేవినేని ఉమ తప్పు చేశాడన్న విషయం చంద్రబాబుకు తెలుసు. దేవినేని నీచ పనులకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారు. అబద్ధాలను నిజం చేసేందుకే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. దేవినేని ఉమను సమర్ధిస్తున్న చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. మరో ఎమ్మెల్యే జోగి రమేష్ ‘‘చంద్రబాబు బుద్ధి కొంచెం కూడా మారలేదు. దళితులపై దాడి చేసిన దేవినేని ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్తారు. చంద్రబాబుకు కొంచెం కూడా అగ్రవర్ణ అహంకారం తగ్గలేదు. టీడీపీ నిజనిర్ధారణ కమిటీతో పాటు మేమూ వస్తాం.. మీరు సిద్ధమేనా. మైనింగ్‌లో దోచుకుంది ఎవరో మొత్తం తేలుస్తాం’’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ ఎంపీ సురేష్ మాట్లాడుతూ.. ‘‘పాము పగబట్టినట్లు చంద్రబాబు దళితులపై పగబట్టారు. ఎన్నికల్లో ఓడించారనే కక్షతోనే దళితులపై దాడులు చేస్తున్నారు. దళితులపై దాడి చేసిన వారిని పరామర్శించడమేంటి’’ అని ప్రశ్నించారు. -
దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకో..
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాపై వైస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవినేని ఉమా మీడియా సమావేశం చూడాలంటే ప్రజలకు అసహ్యం వేస్తోందన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పినా ఉమాలో మార్పు రాలేదని మండిపడ్డారు. ఉమా ఇసుక మాఫియా కింగ్ అని.. అందుకే చంద్రబాబు తన ఇసుక దీక్షావేదిక మీద ఆయనను కూర్చోనివ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు పంట అని అన్నారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం రాసుకోండి అంటూ ఉమ గతంలో బీరాలు పలికిన విషయాన్ని గుర్తు చేశారు. 2018 నాటికి పోలవరం ఎక్కడ పూర్తి చేశారో దేవినేని ఉమా చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు చేసిన అవినీతి నచ్చకనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రివర్స్ టెండరింగ్ చేపట్టారని గుర్తు చేశారు. దేవినేని ఉమా వెకిలి చేష్టలు చూసి కేసీఆర్ ఉమా ఆడో మగో తెలియదన్నారని, ఇప్పుడు అదే నిజమవుతోందని వ్యాఖ్యానించారు. దేవినేని ఉమా పిచ్చెక్కి మాట్లాడుతున్నారని, జగన్మోహన్రెడ్డి తలుపులు తెరిస్తే టీడీపీ ఉండేది కాదన్నారు. దేవినేని ఉమా మంత్రులను పట్టుకొని సన్నాసి అని మాట్లాడడం సరికాదని హితవు పలికారు. వైఎస్ జగన్‌కు సంస్కారం ఉంది కాబట్టి టీడీపీ నేతలపట్ల గౌరవంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదాంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇకనైనా దేవినేని ఉమా వెకిలి చేష్టలు మానుకోవాలని సూచించారు. ఏపీలో టీడీపీ అంపశయ్య మీద ఉందని, తెలంగాణలో కనుమరుగైన ఆ పార్టీకి జాతీయ పార్టీ అని చెప్పుకొనే అర్హత లేదన్నారు. లోకేష్, ఉమా ఎక్కడెక్కడ కమీషన్లు తీసుకున్నారో వెల్లడించేందుకు ఆ కమీషన్లు ఇచ్చినవారు త్వరలో మీడియా సమావేశం పెడుతున్నారని తెలిపారు. మైలవరం నియోజకవర్గం పనుల్లో నారా లోకేష్ 5 శాతం, ఉమా 3 శాతం చొప్పున కమీషన్లు వసూలు చేశారని ఆరోపించారు. చేసిన అవినీతికి దేవినేని ఉమాకు జైలు జీవితం తప్పదని హెచ్చరించారు. -
ఈసారి దేవినేని ఉమ గెలుపు డౌటే!
సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గ టీడీపీలో గెలుపుపై ధీమా సన్నగిల్లుతోంది. మంత్రి దేవినేని ఉమ హ్యాట్రిక్ ఆశలపై ప్రజావ్యతిరేకత నీళ్లుకుమ్మరిస్తోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మంత్రిగారి అవినీతి.. అనుయాయుల దందాలు ఈ ఎన్నికల్లో తమ కొంపముంచుతున్నాయనే అంచనాలతో టీడీపీ డీలాపడింది. ఈ ఎన్నికల్లో గెలుపోటములపై ఎక్కువగా చర్చనీయాంశమవుతున్న ప్రధాన నియోజకవర్గాల్లో కృష్ణాజిల్లా మైలవరం ఒకటి. ఇక్కడ ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు మంత్రి దేవినేని ఉమ, మరోవైపు మాజీమంత్రి కుమారుడు వసంత కృష్ణప్రసాద్ ఈ నియోజకవర్గంలో హోరాహోరీ తలపడ్డారు. గెలుపుపై ఇరువర్గాలు ధీమా వ్యక్తం చేస్తుండటంతో.. మైలవరంలో విజేత ఎవరూ అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మైలవరం నియోజకవర్గంలో 2 లక్షల 59 వేల 500 మంది ఓటర్లుండగా.. వీరిలో స్త్రీలు 1,30,812, పురుషులు 1,28,673. టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావించిన దేవినేని ఆశలు ఆవిరేనని క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి ప్రజలకు బాగా దగ్గరైన వసంత కృష్ణప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగడంతోనే దేవినేనికి గట్టిపోటీ ఎదురయ్యిందని, ఈసారి దేవినేని ఉమ గెలుపు డౌటేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గట్టి ప్రత్యర్థిని ఎన్నికల్లో ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో మంత్రి దేవినేని ఉమ చివరికి అధికార దుర్వినియోగానికి ప్రయత్నించడం కూడా రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం అయ్యింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌పై తప్పుడు కేసులు పెట్టించేందుకు మంత్రి దేవినేని చేసిన ప్రయత్నం అభాసుపాలై.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలతను మరింత పెంచింది. మైలవరం నియోజకవర్గంలో మంచినీటి సమస్యను, మామిడి రైతుల కష్టాలను, సాగునీటి అవసరాలను పట్టించుకోకుండా మంత్రిదేవినేని ఉమ అయిదేళ్లపాటు నడిపిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఇదే క్రమంలో అక్రమ మైనింగ్ ద్వారా ఆయన అనుయాయులకు కోట్ల రూపాయలను దండుకునే అవకాశం కల్పించడం, ఇసుక, మట్టి తవ్వకాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం, చివరికి అనుమతిలేని బోట్లతో అమాయకుల ప్రాణాలు పోయేందుకు కారణమవ్వడం వంటి అంశాలు అనేకం తెలుగుదేశం పార్టీకి ప్రతికూలంగా మారాయి. జన్మభూమి కమిటీల కారణంగా అర్హులైనవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కకపోవడం, పైరవీ కారులు, అనర్హులకే పెన్షన్ల నుంచి పక్కాగృహాల వరకు కట్టబెట్టడం మొదలైన అంశాలు మంత్రి దేవినేని ఉమకు ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పని స్థితిని తెచ్చిపెట్టాయని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. మైలవరం నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ కోట్లాది రూపాయలను ఖర్చు చేసిందనే ప్రచారం జరుగుతోంది. ధన ప్రభావం అధికంగా కనిపించిన నియోజకవర్గాల్లో మైలవరంకూడా నిలుస్తోంది. మంత్రి దేవినేని ఉమ అవినీతి సొమ్ముతో ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ప్రతిపక్షాలు బాహాటంగానే విమర్శలు చేశాయి. దాంతో మైలవరం ప్రజలు...అధికార టిడిపిపై తీవ్ర అసంతృప్తితో రగిలి పోయారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోపై అభిమానం పెంచుకున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో అధిక శాతం అంశాలు తమకు ప్రతికూలంగా కనిపిస్తుండటంతో తెలుగుదేశం నేతలు నిరుత్సాహంలో పడ్డారు. -
దేవినేని ఉమకు షాక్ ఇచ్చిన సోదరుడు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఊహించని షాక్ తగిలింది. ఆయన సోదరుడు దేవినేని చంద్రశేఖర్ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి దేవినేని చంద్రశేఖర్ లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. పార్టీ కండువా కప్పి చంద్రశేఖర్‌ను వైఎస్సార్సీపీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనేక రకాల కారణాలు వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పారు. చదవండి: అమ్మ.. ఉమా! అధికార పార్టీ దోపిడీ ఎక్కువగా ఉందని, పట్టిసీమ ఇరిగేషన్ లాంటి ప్రాజెక్టుల్లో దోపిడీ అధికంగా ఉందని ఆరోపించారు. కేసుల నుండి టీడీపీ నేతలు బయటపడ లేరని అన్నారు. రావణుడి లంక నుండి విభీషణుడు బయటకు వచ్చినట్లు దేవినేని ఉమ నుండి దేవినేని చంద్రశేఖర్ బయటకు వచ్చారని వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. దేవినేని చంద్రశేఖర్, తాను ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమను అణగదొక్కాలని మంత్రి దేవినేని ఉమ చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకా మంత్రి ఆగడాలు సాగవన్నారు. చదవండి: టీడీపీకి దెబ్బ పడింది -
మైలవరం వివాదంలో ఎస్ఐలే దోషులు..
సాక్షి, విజయవాడ : అధికారం ఉంది కదా.. మనకు అడ్డెవరు అనుకున్న టీడీపీ నేతలు బొక్కబోర్లాపడ్డారు. స్థానిక పోలీసులతో చేతులు కలిపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బుందులకు గురిచేయాలనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. కొద్ది రోజుల క్రితం మైలవరంలో రాజుకున్న రాజకీయ వివాదాన్ని జిల్లా ఎస్పీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ముగింపు పలికారు. ఎన్నికల్లో తమకు సహకరించాలంటూ నియోజకవర్గంలోని పోలీసులకు వైఎస్సార్ సీపీ నేతలు డబ్బులు ఇవ్వజూపారనే ఆరోపణ అవాస్తమని పోలీసు ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ ఎస్ఐలకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని, అవన్నీ అసత్య ఆరోపణలని స్పష్టం చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసిన జి.కొండూరు ఎస్ఐ అస్ఫక్, మైలవరం ఎస్ఐ శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ వీఆర్‌లోకి పంపించారు. అసలేం జరిగిందంటే.. తమకు కవర్లలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ వైఎస్సార్ సీపీ నాయకులపై స్థానిక పోలీసులు తప్పుడు కేసులు బనాయించారు. తమపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒత్తిడితో పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. మైలవరం సీఐ, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టేందుకు వైఎస్సార్సీపీ నేతలు సన్నాహాలు చేపట్టాయి. దీనికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు కూడా ధర్నా చేయాలంటూ మంత్రి దేవినేని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో వైఎస్సార్సీపీ ధర్నాను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో దీనిపై పోలీసులు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. -
మైలవరం వివాదంలో ఎస్ఐలే దోషులు..
-
‘సర్జరీ అవుతున్న వ్యక్తి ఆందోళన చేశాడా’
సాక్షి, మైలవరం : మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మైలవరం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ విమర్శలు గుప్పించారు. దేవినేని ఉమ దిగజారుడుతనంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటున్న వెంకట రామారావు అనే వ్యక్తి ఆందోళన చేశాడని పోలీసులు కేసు పెట్టారు. ఇదేంటని ప్రశ్నిస్తే ప్రలోభాలకు గురిచేశారని మరో కేసు పెట్టారు. పోలీసులు మాపై తప్పుడు కేసులు పెడుతున్నారనడానికి ఇదే నిదర్శనం. పోలీసులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మంత్రికి వత్తాసు పలికి తమ కర్తవ్యాన్ని విస్మరించకూడదు. నిజంగా మేం డబ్బులిచ్చి పోలీసులను ప్రలోభాలకు గురిచేసినట్టయితే సీసీటీవీ ఫుటేజీలు బయటపెట్టాలి’ అని కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. ('మంత్రి చేతుల్లో పోలీసులు పావులుగా మారారు') -
మైలవరం పీఎస్ వద్ద ఉద్రికత్త
సాక్షి, విజయవాడ : మైలవరం పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒత్తిడితో పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ మండిపడ్డారు. మైలవరం సీఐ, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టేందుకు వైఎస్సార్సీపీ నేతలు సన్నాహాలు చేపట్టాయి. దీనికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు కూడా ధర్నా చేయాలంటూ మంత్రి దేవినేని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో వైఎస్సార్సీపీ ధర్నాను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. సీఐ, ఎస్ఐ నమోదు చేసిన తప్పుడు కేసులు బటయపడతాయని మంత్రి ఆందోళన చెందుతున్నారని కృష్ణప్రసాద్ విమర్శించారు. ('మంత్రి చేతుల్లో పోలీసులు పావులుగా మారారు') మంత్రి దేవినేని ఉమ, ఆయన అనుచరుల కలప స్మగ్లింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశామనే కక్షతో సదరు సీఐ తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని వసంత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు. పోలీసులకు కవర్లలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ తప్పుడు కేసులు పెట్టారని నిప్పులు చెరిగారు. దమ్ముంటే పోలీసులు తమ వద్ద ఉన్న సీసీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. -
‘అందుకే నన్ను అరెస్ట్ చేయించాడు’
-
‘అందుకే నన్ను అరెస్ట్ చేయించాడు’
సాక్షి, విజయవాడ : టీడీపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు తప్పు ఎత్తి చూపినందుకే తమ పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారంటూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి ఉమా మహేశ్వర రావు మైలవరం నియోజకవర్గ ప్రజలను మోసగిస్తున్నారని మండి పడ్డారు. జల వనరుల శాఖ స్థలాన్ని కన్వర్షన్ చేయకుండా పేదలకు దొంగ పట్టాలిచ్చారని ఆరోపించారు. పట్టాల స్థానంలో జవాబుపత్రం అనే పనికిరాని కాగితాలను ఇచ్చి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారంటూ మండి పడ్డారు. ఉమ తప్పు ఎత్తి చూపినందుకే జన్మభూమి సమావేశంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేయడమే కాన తనను అరెస్ట్ చేశారని తెలిపారు. ఉమా మహేశ్వర రావు అబద్దాలు, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మైలవరం నియోజకవర్గంలోని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. -
దేవినేని ఉమ జైలుకు వెళ్లడం ఖాయం
సాక్షి, విజయవాడ : పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతిపై కాగ్ నివేదిక నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం సమన్వయకర్త వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన... ప్రతీ విషయానికి స్పందించే ఉమా కాగ్ నివేదికపై ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణలో హరీశ్ రావు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఉమా మాత్రం హడావుడి చేస్తూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రతీ సోమవారం పోలవరం వెళ్లి కమీషన్లు తీసుకోవడమే ఉమా లక్ష్యమని ఆరోపించారు. అసమర్థ సాగునీటి మంత్రి ఉమా అని.. కమీషన్ల కోసం తాపత్రయపడటమే ఆయన పని అంటూ కృష్ణ ప్రసాద్ విమర్శించారు. రమేశ్‌బాబుకు ఎలా ఇచ్చారు? పోలవరం సీఈ రమేశ్ బాబు తెలంగాణ వ్యక్తి అని, ఏమాత్రం అనుభవం లేని అటువంటి వ్యక్తికి ఇంతపెద్ద ప్రాజెక్టు ఎలా అప్పజెప్పారని కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. రమేశ్ బాబు, ఉమా మధ్య ఉన్న బంధం ఏమిటో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పోలవరం అవినీతిపై వచ్చే వారం లీగల్ ఒపీనియన్ తీసుకుని సోమవారం లేదా మంగళవారం ఉమా అవినీతిపై ఫిర్యాదు చేస్తానన్నారు. ఉమా అవినీతిపై పూర్తి ఆధారాలున్నాయని, అవన్నీ సీబీఐకి అప్పగిస్తానని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై సమగ్ర విచారణ జరిగితే దేవినేని ఉమ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపుందుకున్నాయి. రాష్ట్రం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలు, ప్రజల సంక్షేమం కోసం పడుతున్న తపన చూసి పలువురు నేతలు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్ గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో వసంత కృష్ణప్రసాద్ సహా వందలాది మంది కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ జగన్ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తామని వసంత నాగేశ్వరరావు, కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా చెప్పారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని కృష్ణప్రసాద్ అన్నారు. అధికారంలోని వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో ఉన్నాయని వసంత నాగేశ్వరరావు అన్నారు. వసంత నాగేశ్వరరావుతో వైఎస్ జగన్ కరచాలనం -
వైఎస్సార్సీపీలో చేరుతున్నా..
నందిగామ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో త్వరలో ఆ పార్టీలో చేరబోతున్నట్లు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు, టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్ చెప్పారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరంలోని తన స్వగృహంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్‌లో ఉన్న తన వర్గీయులు కూడా పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వారందరితో కలిసి త్వరలో భారీ ర్యాలీగా వెళ్లి పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను కలిసి పార్టీ కండువా కప్పుకుంటానని చెప్పారు. ‘నేను పార్టీ మారుతున్నట్లు తెలియడంతో సీఎం చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. గుంటూరు సీటు ఇస్తానని నాకు హామీ ఇచ్చారు. కానీ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధం నేపథ్యంలో వైఎస్సార్సీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను’ అని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. జగన్ ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి వసంత కృష్ణప్రసాద్
-
వైఎస్సార్ సీపీలోకి వసంత కృష్ణప్రసాద్
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి భారీగా వలసలు ఊపుందుకున్నాయి. మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, నందిగామ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్ వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ఆయన తెలిపారు. కృష్ణాజిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు వసంత కృష్ణప్రసాద్ సోమవారం వెల్లడించారు. మరోవైపు టీడీపీ నేత, యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు కూడా మే 5వ తేదీన వైఎస్సార్ సీపీలో చేరబోతున్నారు. కాగా కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలతో తరలివచ్చి కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం కనుమూరు సమీపంలో పాదయాత్ర సాగిస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.