సాక్షి, విజయవాడ : టీడీపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు తప్పు ఎత్తి చూపినందుకే తమ పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారంటూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి ఉమా మహేశ్వర రావు మైలవరం నియోజకవర్గ ప్రజలను మోసగిస్తున్నారని మండి పడ్డారు. జల వనరుల శాఖ స్థలాన్ని కన్వర్షన్ చేయకుండా పేదలకు దొంగ పట్టాలిచ్చారని ఆరోపించారు.
పట్టాల స్థానంలో జవాబుపత్రం అనే పనికిరాని కాగితాలను ఇచ్చి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారంటూ మండి పడ్డారు. ఉమ తప్పు ఎత్తి చూపినందుకే జన్మభూమి సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి చేయడమే కాన తనను అరెస్ట్ చేశారని తెలిపారు. ఉమా మహేశ్వర రావు అబద్దాలు, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మైలవరం నియోజకవర్గంలోని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment