సాక్షి, ఏలూరు: టీడీపీ నేతల వ్యాఖ‍్యలపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంత్రి రాంబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘‘ఖరీఫ్ కోసం గోదావరీ డెల్టాకు నీరు విడుదల చేశాము. ఈరోజు పోలవరం పనుల పురోగతిపై అధికారుతో సమీక్ష నిర్వహించాము. సాధ్యమైనంత త్వరలో పోలవరం పూర్తి చేస్తాము. పోలవరంపై అనేక అవాస్తవ కథనాలు రాస్తున్నారు.
డయాఫ్రమ్ వాల్ టీడీపీ అవగాహన రాహిత్యం వల్లే దెబ్బతిన్నది. రివర్స్ టెండరింగ్ వల్ల జరిగిందని చంద్రబాబు అంటున్నారు. నాకు మాములు వాల్‌కి డయాఫ్రమ్ వాల్‌కి తేడా తెలియదని వ్యంగంగా అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రావీణ్యం కలిగిన వ్యక్తి దేవినేని ఉమా అయితే.. డయాఫ్రం వాల్ దెబ్బ తిన్నప్పుడు ఏం చేశారు. వారు నిర్మించిన డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినటానికి కారణం ఎవ్వరు?. కాపర్ డామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ చేపట్టడం తప్పు కాదా?. ఏపీకి లైఫ్ లైన్ లాంటిది పోలవరం. దీనికి కారణమైన మిమ్మల్లి ప్రజలు క్షమించరు’’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన విక్రమ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment