
సాక్షి, కృష్ణా : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ధ్వజమెత్తారు. ‘ఉమా నీ నోరు అదుపులో ఉంచుకోవడం మంచిది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రోన్ కెమెరాలతో వరద ఉధృతిని అంచనాలు వేస్తుంటే తమపై తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడే వరదలను మ్యాన్ మేడ్ వరదలుగా అభివర్ణించటం నీకే సాధ్యమైంది. అమరావతి రాజధాని మా ప్రభుత్వ హయాంలో ఇక్కడే ఉంటుంది. లేనిపక్షంలో నేను నా పదవికి రాజీనామా చేస్తా. లేకపోతే నువ్వు శాశ్వతంగా రాజకీయాలకు దూరమవుతావా?. గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు మూడు నెలల ముందు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నా క్యాంటీన్లను మూయించాల్సిన అవసరం మాకు లేదు’’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment