
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... టీడీపీ ఉనికి కోసమే దిగజారుడు రాజకీయాలు చేస్తోందని అన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నింటిని భ్రష్టు పట్టించారని విమర్శించారు. సీఎం జగన్ పాలనలో ప్రశాంత వాతావరణం నెలకొందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు. డ్యూటీలో ఉన్న ఐపీఎస్ అధికారిని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు యూజ్ లెస్ ఫెలో అనడం బాధాకరమని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.