సాక్షి, కృష్ణా: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హెచ్చరించారు. మైలవరంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. మీ లాగా ఇసుక వ్యాపారం చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలు బుద్ది చెప్పినా కూడా తీరు మారని దేవినేని ఉమా వెకిలి మాటాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోకపోతే సరైన బుద్ది చెబుతామని, ఉనికిని కాపాడుకోవడం కోసం ఎదుటి వారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఉరుకునేది లేదని మండిపడ్డారు. మరోసారి తనపై నిరాధార ఆరోపణలు చేస్తే స్వయంగా మీ ఇంటికి వచ్చి కాలర్ పట్టుకుని నిలదీస్తానని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment