ఎప్పటికీ జగన్‌ వెంటే ఉంటా  | I Will Always Be With YS Jagan Vasantha krishna Prasad | Sakshi
Sakshi News home page

ఎప్పటికీ జగన్‌ వెంటే ఉంటా 

Published Sat, Feb 11 2023 8:33 AM | Last Updated on Sat, Feb 11 2023 10:10 AM

I Will Always Be With YS Jagan Vasantha krishna Prasad - Sakshi

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): తాను ఎప్పటికీ సీఎం వైఎస్‌ జగన్‌ వెంటే ఉంటా­నని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ స్పష్టంచేశారు. అనివార్య కార­ణా­లవల్ల నియోజకవర్గంలో తాను కొంతకాలంగా చురుగ్గా లేనని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ మారుతున్నట్లు సోషల్‌ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేశారన్నారు. తన మనసు సహకరించకపోతే తన పని తాను చేసుకుంటూ పో­తా­­నే తప్ప పార్టీ మారబోనన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా­తో మాట్లాడారు. సీఎం జగన్‌ తనను పిలిపించి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై తనకు స్పష్టతనిచ్చారన్నారు. మరో వారం రో­జు­ల్లో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తానన్నారు.  

టీడీపీకి లోకేశ్‌ పెనుభారం 
లోకేశ్‌ పాదయాత్ర టీడీపీ­కి పెనుభారమే తప్ప ఎలాం­టి ప్రయోజనం ఉండబోదన్నారు. ఇక ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు టీడీపీ­ని ఏ విధంగా దొంగిలించాడో అదే రీతిలో మాజీమంత్రి దేవినేని ఉమా కబ్జాల సంస్కృతి నేర్చుకున్నాడని వసంత ఆరోపించారు. పార్టీ కా­ర్యాలయం కోసం వృద్ధ మహిళ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేశారు.

టీడీపీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన ఉమా.. రూ.300 కోట్లపై చిలుకు ఇరిగేష­న్‌ కాంట్రాక్టులు ఇప్పిస్తానని ఖమ్మం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.20 కోట్లు తీసుకుని ఎన్నికల్లో ఖర్చుచేశాడన్నారు. గుంటుపల్లికి చెందిన ఒక నాయకుడి వద్ద రూ.7 కోట్లు, కొండపల్లికి చెందిన మరో వ్యక్తి వద్ద రూ.5 కోట్లు, మూర్తి అనే కాంట్రాక్టర్‌ వద్ద రూ.3 కోట్లు తీసుకున్నాడని, మరో ఇద్దరి వద్ద రూ.50లక్షల చొప్పున తీసుకుని తిరిగి చెల్లించలేదని, పైగా వాళ్ల ఫోన్లు కూడా ఎత్తడంలేదని వసంత చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement