గోదావరిఖని: నాటక రంగం నుంచి సినిమా రంగం వైపు వచ్చి తెలంగాణను ఇంటిపేరుగా మార్చుకున్న శకుంతల శనివారం హైదరాబాద్‌లో గుండెపోటుకు గురై మరణించారు. ఆమె విలన్‌గా... తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను మెప్పించారు. చాలా సందర్భాల్లో గోదావరిఖనికి వచ్చిన శకుంతల మరణాన్ని ఈ ప్రాంతంలో ఆమెతో అనుబంధం ఉన్న వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆమె చెల్లెలు సాధన గోదావరిఖనిలో నివసిస్తున్నారు. ఆమె భర్త హరియాదవ్ సింగరేణి ఆర్జీ-1లోని 3వ గనిలో మైనింగ్ సర్దార్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన చనిపోయారు. వీరి పిల్లలు గోదావరిఖనిలోనే నివాసముంటూ స్థానికంగా ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. కాగా పోరు తెలంగాణ, నిర్భయ భారతం సినిమాల షూటింగ్ సందర్భంలో శంకుతల గోదావరిఖనిలోని వివిధ లోకేషన్లలో పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న యాపిల్ కిడ్స్ ప్లే స్కూల్‌లో చిన్నారుల తన పుట్టిన రోజు వేడుకలను కూడా జరుపుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఆ సమయంలో ఆమెతో కలిసి సన్నిహితంగా మాట్లాడిన అభిమానులు శంకుతల మరణాన్న జీర్ణించుకోలేకపోతున్నారు.
కోల్‌బెల్ట్‌తో తెలంగాణ శకుంతలకు అనుబంధం
Published Sun, Jun 15 2014 2:27 AM | Last Updated on Tue, Oct 2 2018 3:16 PM
Advertisement
Advertisement