అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్న ప్రేమోన్మాది | phyco attack on two womens | Sakshi
Sakshi News home page

అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్న ప్రేమోన్మాది

Published Tue, Jul 14 2015 11:27 AM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM

అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్న ప్రేమోన్మాది

అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్న ప్రేమోన్మాది

హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి, కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో మంగళవారం ఉదయం ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ పేరుతో అక్కాచెళ్లల్లపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువతులు చికిత్స పొందుతూ మృతి చెందారు. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన కృష్ణారెడ్డి, హైమావతి దంపతులకు యామిని సరస్వతి, శ్రీలేఖ సంతానం.

కాగా, వీరు చైతన్యపురి పీఎస్ పరిధిలోని మోహన్‌నగర్‌లో నివాసముంటున్నారు. యామిని గీతం కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేయగా, శ్రీలేఖ చేవెళ్లలోని సాగర్ ఇంజనీరింగ్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతుంది. అదే కాలేజీకి చెందిన అమిత్ సింగ్ శ్రీలేఖను ప్రేమించమని రెండు సంవత్సరాలుగా వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అతనిపై గతంలోనే పోలీసులకు  ఫిర్యాదు చేశారు. అయినా అమిత్ లో ఎటువంటి మార్పురాలేదు.

తాజాగా మంగళవారం ఉదయం మోహన్‌నగర్‌లోని శ్రీలేఖ ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే తన వద్ద ఉన్న కత్తితో శ్రీలేఖపై దాడి చేశాడు. పక్కనే ఉన్న అక్క యామిని అడ్డురావడంతో ఆమెపై కూడా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. దాడి సమయంలో శ్రీలేఖ తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వైద్యం కోసం స్థానిక ఒమిని ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్రంగా గాయపడిన యామిని, శ్రీలేఖ వైద్య సేవలు అందిస్తుండగా మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement