దేవుడున్నాడని...!
దేవుడున్నాడని...!
Published Tue, Feb 11 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
మనీష్, యామిని జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. ముళ్లపూడి వరతో కలిసి వి.వి.వరాంజనేయులు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నటి జయలలిత కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత అశోక్‌కుమార్ క్లాప్ ఇచ్చారు. ‘‘దేవుడు ఉన్నాడని కొందరు, లేడని కొందరు వాదిస్తుంటారు. నా అనుభవాలను బట్టి దేవుడున్నాడని నమ్ముతాను. దేవుడి విషయంలో నాకు ఎదురైన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నా. మణిశర్మ ఈ చిత్రానికి స్వరాలందించడం పెద్ద ఎస్సెట్. ఇందులో చక్కని ప్రేమకథ కూడా ఉంటుంది. అరకు, తలకోన ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం’’ అని వరాంజనేయులు చెప్పారు. వరాంజనేయులు చక్కని కథ తయారు చేశాడని ముళ్లపూడి వర అన్నారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు. వి2 క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.
Advertisement
Advertisement