
సాక్షి, అనంతపురం : జిల్లాలో టీడీపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామిని బాల టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది కాలంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల శమంతకమణి, యామిని బాల అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీలో కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వటంపై వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు దళితులను పక్కన పెడుతున్నారని వీరు మనస్తాపం చెందారు. ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లో టీడీపీ విప్ జారీ చేసినా కూడా శమంతకమణి హాజరు కాకపోవడం గమనార్హం. టీడీపీపై అసంతృప్తితో ఉన్న తల్లికూతుళ్లు త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు కార్యకర్తలకు సంకేతాలు పంపినట్లుగా సమాచారం.