
టైటిల్ డిఫరెంట్‌గా ఉంది : దాసరి
టైటిల్ చాలా డిఫరెంట్‌గా అనిపించింది. రెండు షేడ్స్‌లో కనబడటానికి తారకరత్న ఎనిమిది నెలలు కష్టపడ్డాడు’’
‘‘టైటిల్ చాలా డిఫరెంట్‌గా అనిపించింది. రెండు షేడ్స్‌లో కనబడటానికి తారకరత్న ఎనిమిది నెలలు కష్టపడ్డాడు’’ అని దాసరి నారాయణరావు అన్నారు. నందమూరి తారకరత్న, శిల్ప, యామినీ ముఖ్యతారలుగా లగడపాటి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘కాకతీయుడు’. విజయ్ సముద్ర దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో దాసరి విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘దాసరి గారు తీసిన ‘బొబ్బిలిపులి’లా ఈ సినిమా కూడా సమాజానికి మంచి సందేశాన్నిస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: పి సహదేవ్, సహనిర్మాతలు: పొందూరి కాంతారావు, గూడూర్ గోపాల్ శెట్టి, తెల్ల సుధీర్ బాబు, గుర్రం మహేశ్ చౌదరి.