
పోరు బాటలో...
పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారిన ఉచిత విద్యాపథకాలపై ఓ యువకుడు సాగించిన పోరు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘కాకతీయుడు’. నందమూరి తారకరత్న, శిల్ప, యామిని జంటగా శ్రీ ఎల్.వి.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై లగడపాటి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ సముద్ర దర్శకుడు.
ఎస్.ఆర్. శంకర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. ఇందులో డ్యుయెల్ రోల్ చేశానని తారకరత్న చెప్పారు.
తారకరత్న బాగా నటించారని, డైలాగ్స్ చాలా బాగా చెప్పారనీ అని దర్శకుడు అన్నారు. సీనియర్ దర్శకుడు బి.గోపాల్, హీరో రాజశేఖర్, సంగీత దర్శకుడు ఎస్.ఆర్ శంకర్ తదితరలు పాల్గొన్నారు.