Kakatiyudu
-
‘కాకతీయుడు’తో జతకట్టా..
సినీనటి, మిస్ విజయవాడ రేవతీ చౌదరి ఏలూరు (కామవరపుకోట) : తారకరత్న సరసన తాను నటించిన ‘కాకతీయుడు’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వర్ధమాన సినీనటి, ’మిస్ విజయవాడ’ రేవతీ చౌదరి తెలిపారు. మండలంలోని తూర్పు యడవల్లిలో గురువారం రాత్రి జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు. తనది విజయవాడ అని, ’మిస్ విజయవాడ’ టైటిల్ గెలుచుకున్న అనంతరం సినిమాల్లో అవకాశాలొస్తున్నాయన్నారు. శివాజీ హీరోగా నటించిన సినిమాలో మొదటిసారిగా తెరంగేట్రం చేశానని, అయితే ఆ సినిమా ఇంకా విడుదల కాలేదని చెప్పారు. తారకరత్నతో నటించిన ‘కాకతీయుడు’ సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్నారు. తన అభిమాన నటుడు బాలకృష్ణ, అభిమాన నాయకి శ్రీదేవి అని చెప్పారు. జగదేకవీరుడు-అతిలోక సుందరి సినిమాలో శ్రీ దేవి ధరించిన దేవకన్యలాంటి పాత్ర చేయాలని ఆశగా ఉందని తెలిపారు. ప్రస్తుతం సముద్ర దర్శకత్వంలో ఓ మరో చిత్రంతో పాటు, తమిళ సినిమాల్లోనూ నటిస్తున్నట్టు చెప్పారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే చిత్రసీమలోకి అడుగుపెట్టినట్టు తెలిపారు. -
పోరు బాటలో...
పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారిన ఉచిత విద్యాపథకాలపై ఓ యువకుడు సాగించిన పోరు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘కాకతీయుడు’. నందమూరి తారకరత్న, శిల్ప, యామిని జంటగా శ్రీ ఎల్.వి.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై లగడపాటి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ సముద్ర దర్శకుడు. ఎస్.ఆర్. శంకర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. ఇందులో డ్యుయెల్ రోల్ చేశానని తారకరత్న చెప్పారు. తారకరత్న బాగా నటించారని, డైలాగ్స్ చాలా బాగా చెప్పారనీ అని దర్శకుడు అన్నారు. సీనియర్ దర్శకుడు బి.గోపాల్, హీరో రాజశేఖర్, సంగీత దర్శకుడు ఎస్.ఆర్ శంకర్ తదితరలు పాల్గొన్నారు. -
కాకతీయుడి మూవీ స్టిల్స్
-
కాకతీయుడి పౌరుషం
కాకతీయుల పౌరుషాన్ని, రాజసాన్ని పుణికిపుచ్చుకున్న ఓ కుర్రాడి కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘కాకతీయుడు’. తారకరత్న టైటిల్ రోల్ పోషిస్తున్నారు. శిల్పష్వి యామిని కథానాయిక. వి.సముద్ర దర్శకత్వంలో లగడపాటి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘మాస్ ప్రేక్షకులను మెప్పించే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. తారకరత్న నటన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ నెల 10 నుంచి 25 వరకూ కర్నూల్, హైదరాబాద్ పరిసరాల్లో కొంత టాకీనీ, నాలుగు పాటలనూ చిత్రీకరిస్తాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. వినోద్‌కుమార్, వెంకట్‌ప్రభు, తిరుపతి, ప్రకాశ్, చందు, విజయరంగరాజు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి. సహదేవ్, సంగీతం: ఎస్.ఆర్.శంకర్, ఠాగూర్, కూర్పు: నందమూరి హరి, సహనిర్మాతలు: గూడూరి గోపాల్‌శెట్టి, పొందూరి కాంతారావు, కె.పి.బాలాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గుర్రం మహేశ్ చౌదరి, సమర్పణ: లగడపాటి వెంకాయమ్మ. -
కాకతీయుడు అత్యంత శక్తిమంతుడు
‘‘నా కెరీర్‌కి మేలి మలుపుగా నిలిచే సినిమా ఇది. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. నా పాత్రను భిన్నంగా, అత్యంత శక్తిమంతంగా దర్శకుడు సముద్ర తీర్చిదిద్దుతున్నారు’’ అని తారకరత్న అన్నారు. ఆయన కథానాయకునిగా వి.సముద్ర దర్శకత్వంలో లగడపాటి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘కాకతీయుడు’. ఈ చిత్ర విశేషాలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తారకరత్న మాట్లాడారు. నిర్మాత శ్రీనివాస్ తనకు పదేళ్ల నాటి మిత్రుడనీ, తొలి సినిమా తనతోనే చేయాలనే పట్టుదలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తారకరత్న చెప్పారు. తన ‘ఒకటో నంబర్ కుర్రాడు’ స్థాయిలో పాటలు కుదిరాయని ఆయన ఆనందం వెలిబుచ్చారు. ‘తారకరత్నతో నా రెండో సినిమా ఇది. శిల్ప, యామిని ఇందులో కథానాయికలు. కొత్తవారైనా చక్కగా నటిస్తున్నారు. వినోద్‌కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. గుంటూరు, వినుకొండ పరిసరాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపాం’’అని సముద్ర చెప్పారు. ‘‘80 శాతం చిత్రీకరణ పూర్తయిందని, మిగిలిన భాగాన్ని త్వరలోనే పూర్తి చేసి, వచ్చే నెలలో పాటల్ని, ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: మల్కార్ శ్రీనివాస్, కెమెరా: సి.సహదేవ్, సంగీతం: ఎస్.ఆర్.శంకర్. -
కాకతీయుడు మూవీ ప్రెస్ మీట్