కాకతీయుడి పౌరుషం | Taraka Ratna's 'Kakatiyudu' in last schedule | Sakshi
Sakshi News home page

కాకతీయుడి పౌరుషం

Published Tue, Sep 9 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

కాకతీయుడి పౌరుషం

కాకతీయుడి పౌరుషం

కాకతీయుల పౌరుషాన్ని, రాజసాన్ని పుణికిపుచ్చుకున్న ఓ కుర్రాడి కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘కాకతీయుడు’. తారకరత్న టైటిల్ రోల్ పోషిస్తున్నారు. శిల్పష్వి యామిని కథానాయిక. వి.సముద్ర దర్శకత్వంలో లగడపాటి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘మాస్ ప్రేక్షకులను మెప్పించే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. తారకరత్న నటన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ నెల 10 నుంచి 25 వరకూ కర్నూల్, హైదరాబాద్ పరిసరాల్లో కొంత టాకీనీ, నాలుగు పాటలనూ చిత్రీకరిస్తాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. వినోద్‌కుమార్, వెంకట్‌ప్రభు, తిరుపతి, ప్రకాశ్, చందు, విజయరంగరాజు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి. సహదేవ్, సంగీతం: ఎస్.ఆర్.శంకర్, ఠాగూర్, కూర్పు: నందమూరి హరి, సహనిర్మాతలు: గూడూరి గోపాల్‌శెట్టి, పొందూరి కాంతారావు, కె.పి.బాలాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గుర్రం మహేశ్ చౌదరి, సమర్పణ: లగడపాటి వెంకాయమ్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement