రాజారవీంద్ర, మురళీకృష్ణ, యామినీ భాస్కర్, మారుతి, నవీద్, నూకరాజు
‘‘మా బ్యానర్‌లో విడుదల చేసిన ‘భలేమంచి చౌకబేరమ్’ చిన్న సినిమా అయినా ప్రేక్షకాదరణ బాగుంది. కథ బాగుండటం వల్లే సినిమాను బాగా ఆదరిస్తున్నారు. రోజు రోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. వసూళ్లు ఇంకా పెరిగి, మా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నా’’ అని చిత్ర సమర్పకులు కె.కె. రాధామోహన్ అన్నారు. నవీద్, నూకరాజు, యామినీ భాస్కర్ కీలక పాత్రల్లో మురళీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలేమంచి చౌకబేరమ్’.
ఆరోళ్ల సతీష్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ చిత్రానికి కాన్సెప్ట్ అందించిన డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా తీయడం తేలిక.. కానీ, విడుదల కష్టం. మౌత్ టాక్‌తో రీచ్ అయ్యేలా చేయడం చాలా కష్టం. శనివారం సాయంత్రానికి మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మా టార్గెట్‌ని రీచ్ అయ్యాం’’ అన్నారు. ‘‘చిన్న సినిమా పెద్ద విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు మురళీకృష్ణ.
‘‘టిక్కెట్టుకి 100 రూపాయలు పెడితే 1000 రూపాయల వినోదం ఇచ్చే చిత్రం ‘భలేమంచి చౌకబేరమ్’’ అన్నారు నవీద్. ‘‘సినిమా విడుదల రోజు(శుక్రవారం) ఉదయం ఆటకు మా సినిమా ఓపెనింగ్స్ చూసి నిరుత్సాహపడ్డాం. అదేరోజు సాయంత్రానికి థియేటర్లు ఫుల్ అయ్యాయి’’ అన్నారు నూకరాజు. ‘‘టఫ్ సిచ్యువేషన్‌లో కాన్ఫిడెన్స్‌తో మా సినిమా విడుదల చేశాం. టాక్ బావుంది’’ అన్నారు సతీష్. యామినీ భాస్కర్, నటులు రాజా రవీంద్ర, ముస్తఫా, ఉద్ధవ్, పూర్ణాచారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment