మారుతి
‘‘భలే మంచి చౌక బేరమ్’ చిన్న సినిమా. చిన్న సినిమాల కాన్సెప్ట్‌లు చాలా బాగుంటాయి. కానీ, ప్రేక్షకులు థియేటర్‌కి రారు. సినిమాలు చూడాలంటే అందులో ఏదో సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండాలి. ఈ చిత్రంలో అలాంటి వైవిధ్యమైన పాయింట్ ఉంటుంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. నవీద్, ‘కేరింత’ నూకరాజు హీరోలుగా, యామినీ భాస్కర్ హీరోయిన్‌గా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. కె.కె.రాధామోహన్ సమర్పణలో అరోళ్ళ సతీష్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ చిత్రానికి కాన్సెప్ట్ అందించిన మారుతి చెప్పిన విశేషాలు.
► కృష్ణానగర్‌లో తిరిగే ఇద్దరు బ్యాచిలర్స్‌కి దేశ రహస్యాలకు సంబంధించిన ఒక కవర్ దొరుకుతుంది. వాళ్లు దాన్ని ఎలా బేరం ఆడారు? అనేది ‘భలే మంచి చౌక బేరమ్’ మెయిన్ కాన్సెప్ట్. ఇందులో మంచి మెసేజ్ కూడా ఉంటుంది.
► ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. నేను చెప్పిన ఐడియాకి రవి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి డైలాగ్స్ రాశారు. ‘రోజులు మారాయి’ టీమ్ సెట్ అయ్యింది. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్విస్ట్ ఉంటుంది. సెకండాఫ్ సీరియస్‌గా, కన్‌ఫ్యూజన్ కామెడీతో ఉండే పక్కా కమర్షియల్ చిత్రమిది.
► కె.కె. రాధామోహన్‌గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. మా సినిమా ఫస్ట్‌కాపీ చూసి, బాగా ఇంప్రెస్ అయిన ఆయన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
► ఇకపై పెద్ద చిత్రాలపైనే శ్రద్ధ పెట్టాలనుకుంటున్నా. ప్రస్తుతం చిన్న చిత్రాలు చేయదల్చుకోలేదు. నా సైకిల్ ప్రయాణం స్మూత్‌గా సాగుతోంది. నా తర్వాతి చిత్రం ‘భలే భలే మగాడివోయ్’లా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment