సాఫ్ట్‌వేర్‌ కుర్రాడి ప్రేమకథ | kothaga ma prayanam teaser release | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ కుర్రాడి ప్రేమకథ

Published Thu, Nov 29 2018 2:24 AM | Last Updated on Thu, Nov 29 2018 2:24 AM

kothaga ma prayanam teaser release - Sakshi

ప్రయాంత్, యామినీ

నెలకు రెండు లక్షల రూపాయలు జీతంగా తీసుకునే ఓ సాఫ్ట్‌వేర్‌ కుర్రాడికి ప్రేమ, పెళ్లిపై నమ్మకం ఉండదు. అలాంటివాడు పెళ్లికి ఎలా అంగీకరించాడు? అతనిలో మార్పుకు కారణం ఎవరు? అనే ఆసక్తికర అంశాల ఆధారంగా రూపొందిన చిత్రం ‘కొత్తగా మా ప్రయాణం’. ప్రయాంత్‌ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో యామినీ భాస్కర్‌ కథానాయికగా నటించారు. నిశ్చయ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రమణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

‘‘నలుగురికీ సాయపడుతూ ఓపెన్‌ మైండెడ్‌గా ఉండే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రేమకథ ఇది. తొలి సినిమానే అయినప్పటికీ ప్రయాంత్‌ బాగా నటించాడు. యామినీ భాస్కర్‌ అందచందాలు ఈ సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌. యూత్‌ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేసిన ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు రమణ. భాను, గిరి, సాయి, జీవా, కారుణ్య తదితరులు నటించిన ఈ సినిమాకు సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement