Raja Deluxe Movie Title Name Is Not For Prabhas-Maruthi Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Prabhas - Maruthi Movie : ప్రభాస్‌తో మారుతి చిత్రం.. 'రాజా డీలక్స్' కాదా..!

Published Thu, Mar 17 2022 11:16 PM | Last Updated on Fri, Mar 18 2022 10:16 AM

Prabhas Maruthi Movie Is Not A Raja Deluxe - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ రాధేశ్యామ్‌ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్‌, సలార్‌, స్పిరిట్‌ చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. వీటితో పాటు ప్రభాస్‌ డైరెక్టర్‌ మారుతీ కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. కామెడీ, హార్రర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ  చిత్రం ఉంటుందని సమాచారం. అయితే ఈ చిత్రానికి ఇప్పటికే 'రాజా డీలక్స్‌' అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.

ఇక తాజా విషయం ఏంటంటే ఈ సినిమాకు మొదట రాజా డీలక్స్ అనే టైటిల్ వినిపించినా ఆ టైటిల్ ప్రభాస్ కోసం కాదని మరో హీరో కోసమని సమాచారం. మారుతి మాస్‌ రాజా రవితేజతో కూడా ఓ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే ఆ చిత్రం కోసం మారుతీ 'రాజా డీలక్స్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇక దీంతో ప్రభాస్ చిత్రానికి సరైన టైటిల్ ఖరారు చేసే పనిలో మారుతీతో పాటు అతని బృందం బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రానికి సరైన టైటిల్‌ను త్వరలోనే మేకర్స్‌ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజక్టుకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement