title change
-
ప్రభాస్‌తో మారుతి చిత్రం.. 'రాజా డీలక్స్' కాదా..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్, సలార్, స్పిరిట్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు ప్రభాస్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. కామెడీ, హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. అయితే ఈ చిత్రానికి ఇప్పటికే 'రాజా డీలక్స్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక తాజా విషయం ఏంటంటే ఈ సినిమాకు మొదట రాజా డీలక్స్ అనే టైటిల్ వినిపించినా ఆ టైటిల్ ప్రభాస్ కోసం కాదని మరో హీరో కోసమని సమాచారం. మారుతి మాస్ రాజా రవితేజతో కూడా ఓ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే ఆ చిత్రం కోసం మారుతీ 'రాజా డీలక్స్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇక దీంతో ప్రభాస్ చిత్రానికి సరైన టైటిల్ ఖరారు చేసే పనిలో మారుతీతో పాటు అతని బృందం బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రానికి సరైన టైటిల్‌ను త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజక్టుకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రభాస్ సినిమాకి టైటిల్ మారనుందా? త్వరలోనే అప్డేట్
పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్, స్పిరిట్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు ప్రభాస్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. కామెడీ, హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో సాలిడ్ ఎంటర్టైన్మెంట్గా రూపొందుతున్న ఈ సినిమా గురించి తాజాగా క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే తాజాగా ఆ టైటిల్‌ను మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఆ టైటిల్‌కి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో దాన్ని మార్చాలని చూస్తున్నారట. పాన్ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుందట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. చదవండి: 'రాధేశ్యామ్'పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్ -
బంజార టైటిల్ మార్పు
అమృత, ట్వింకిల్ కపూర్, తేజేష్ వీర, హరీష్ గౌలి, జీవా, జీవీ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బంజార’. ‘క్షుద్ర’ ఫేమ్ నాగుల్ దర్శకత్వం వహించారు. వర్కింగ్ యాంట్స్ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై కోయ రమేష్ బాబు, దేవభక్తుని నవీన నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెలలో విడుదలకానుంది. తాజాగా ‘బంజార’ టైటిల్‌ని మార్చనున్నట్లు రమేష్ బాబు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ హారర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల విడుదలైన మా టీజర్ కొన్ని వర్గాల వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉందని మా దృష్టికి వచ్చింది. కథలో భాగంగానే ఆ టైటిల్‌ను పెట్టాం. ‘బంజార’ పేరుపై వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి వారి అభిప్రాయాలను, మనోభావాలను గౌరవించి త్వరలోనే టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే అన్ని మాధ్యమాల నుండి టీజర్‌ని తొలగించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, కెమెరా: వెంకట్. -
సాయిపల్లవి సినిమా పేరు మారింది..!
తమిళసినిమా: కోలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్న చిత్రాల్లో కరు ఒకటి. కారణం నటి సాయిపల్లవి నటించిన తొలి తమిళ చిత్రం ఇదే కావడం. మలయాళంలో ప్రేమమ్ చిత్రంతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న నటి సాయిపల్లవి, ఆ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఫిదా, ఎంసీఏ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఇప్పుడు కరు చిత్రంతో తమిళప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో కోలీవుడ్‌లోనూ మ్యాజిక్ చేస్తుందో? లేదోనన్న ఆసక్తి నెలకొంది. లైకా సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ దర్శకుడు. టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. మరో విశేషం ఏమిటంటే ఇందులో నటి సాయిపల్లవి ఒక పాపకు తల్లిగా నటించింది. తొలి చిత్రంలోనే తల్లి పాత్రతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ చిత్రంపై సాయిపల్లవి చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పాలి. నటుడు నిళల్గళ్ రవి, రేఖ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, నీరవ్‌షా ఛాయాగ్రహణం అందించారు. మరో విషయం ఏమిటంటే చిత్రం ఈ నెల 27న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇలాంటి సమయంలో చిత్రం పేరును దియా అని మార్చారు. ఇదే చిత్రం తెలుగులో కణం పేరుతో విడుదల కానుంది. ఇకపోతే నటి సాయిపల్లవి తాజాగా సూర్యకు జంటగా ఎన్జీకే, ధనుష్‌తో మారి–2 చిత్రాల్లో నటిస్తోంది. -
నాగార్జున టైటిల్‌తో వస్తున్న అమలాపాల్!
తమిళసినిమా: అమలాపాల్ చిత్రం టైటిల్ మారింది. దర్శకుడు విజయ్‌తో విడాకులు పొందిన తరువాత నటిగా రీఎంట్రీ ఇచ్చిన అమలాపాల్‌ను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె తాజాగా విష్ణువిశాల్‌తో నటిస్తున్న ఓ చిత్రంలో నటిస్తోంది. ‘ముండాసిపట్టి’ చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను మళ్లీ మార్చేశారు. ఈ చిత్రానికి ముందు ‘సిండ్రెల్లా’ అనే టైటిల్‌ను అనుకున్నారు. ఆ తరువాత ‘మిన్మినీ’గా మార్చారు. తాజాగా ‘రక్షకన్’ అంటూ కొత్త పేరును తెరపైకి తెచ్చారు. ఇదే టైటిల్‌తో ఇంతకుముందు నాగార్జున, సుస్మితాసేన్ జంటగా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు పవర్ఫుల్ టైటిల్ అవసరమన్న భావనతో ‘రక్షకన్’గా మార్చినట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. విష్ణువిశాల్ పోలీస్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్ టీచర్‌గా నటిస్తున్నారట. -
శ్రీమంతుడు టీజర్ విడుదల
ప్రిన్స్ మహేష్‌బాబు అప్‌కమింగ్ మూవీ శ్రీమంతుడు టీజర్ ను ఆదివారం రిలీజ్ చేశారు. హీరో కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. శ్రీమంతుడు మూవీపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ ను శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై మిత్రులు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్‌లు సమష్టిగా ‘మిర్చి’ ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ‘ఆగడు’ తర్వాత చాలాకాలంగా తెరపై కనిపించని మహేశ్ ఫస్ట్‌లుక్‌కు సహజంగానే అభిమానుల నుంచి విశేషస్పందన లభించింది. ఇప్పుడు టీజర్ ను కూడా రిలీజ్ చేయడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. -
'శ్రీమంతుడు' కంటే 'మగాడు' బాగుంటుంది!
చెన్నై: యువ హీరో మహేష్ బాబు తాజా చిత్రం 'శ్రీమంతుడు' చిత్రం టైటిల్‌ను మార్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రం పేరును మార్చాలని కోరినట్టు టాలీవుడ్ వర్గాల కథనం. డిస్ట్రిబ్యూటర్లు ఇటీవల సమావేశమై ఈ చిత్రం బిజినెస్ గురించి చర్చించారు. శ్రీమంతుడు పేరు మాస్ వర్గాలకు దగ్గర ఉండదని వారు అభిప్రాయపడ్డారు. స్టార్ హీరో చిత్రానికి టైటిల్ ముఖ్యమని, ఇది బిజినెస్‌పై ప్రభావం చూపుతుందని చెప్పారు. శ్రీమంతుడు బదులు 'మగాడు' అన్న టైటిల్ బాగుంటుందని చాలామంది డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతకు చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రానికి మగాడు అన్న టైటిల్‌ను తొలుత పరిశీలించారని, ఆ తర్వాత శ్రీమంతుడుగా మార్చారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. -
మారిన పొరంబోకు టైటిల్
పొరంబోకు చిత్రం ఇప్పుడు పొరంబోకు ‘ఎన్గిర పొదువుడమై’గా మారింది. ఆర్య, విజయ్ సేతుపతి, శ్యామ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఇది. నటి కార్తిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు జాతీయ అవార్డును గెలుచుకున్న ఇయర్కై చిత్రంతో పాటు ఈ, పేరాన్మై లాంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారన్నది గమనార్హం. యూటీవీ మోషన్స్ పతాకంపై సిద్ధార్థ్ రాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని చిత్ర దర్శకుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన నిజానికి పొరంబోకు అంటే ప్రజలు ఉపయోగానికిసరిపోగా మిగిలిన ప్రభుత్వ భూములన్ని పొరంబోకు భూమి అంటారన్నారు. ఇది తమిళభాషకు చెందిన పదమేనని తెలిపారు. చిత్ర టైటిల్ కూడా విభిన్నంగా ఉందని చాలామంది అన్నారన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలనే పొరంబోకు ఎన్గిర పొదువుడమైగా టైటిల్‌ను మార్చినట్లు చెప్పారు. ఎన్కే ఏకాం బరం చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి నవ సంగీత దర్శకుడు వర్షన్ సంగీత బాణీలు కట్టినట్లు తెలిపారు. చిత్ర ఆడియోను ఈ నెలలో విడుదల చేసి చిత్రాన్ని మే డే సందర్భంగా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.