నాగార్జున టైటిల్‌తో వస్తున్న అమలాపాల్‌! | amala paul film title changed again | Sakshi
Sakshi News home page

నాగార్జున టైటిల్‌తో వస్తున్న అమలాపాల్‌!

Published Mon, Jun 19 2017 7:33 PM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM

నాగార్జున టైటిల్‌తో వస్తున్న అమలాపాల్‌!

నాగార్జున టైటిల్‌తో వస్తున్న అమలాపాల్‌!

తమిళసినిమా: అమలాపాల్‌ చిత్రం టైటిల్‌ మారింది. దర్శకుడు విజయ్‌తో విడాకులు పొందిన తరువాత నటిగా రీఎంట్రీ ఇచ్చిన అమలాపాల్‌ను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె తాజాగా విష్ణువిశాల్‌తో నటిస్తున్న ఓ చిత్రంలో నటిస్తోంది. ‘ముండాసిపట్టి’  చిత్రం ఫేమ్‌ రామ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను మళ్లీ మార్చేశారు.

ఈ చిత్రానికి ముందు ‘సిండ్రెల్లా’ అనే టైటిల్‌ను అనుకున్నారు. ఆ తరువాత ‘మిన్‌మినీ’గా మార్చారు. తాజాగా ‘రక్షకన్‌’ అంటూ కొత్త పేరును తెరపైకి తెచ్చారు. ఇదే టైటిల్‌తో ఇంతకుముందు నాగార్జున, సుస్మితాసేన్‌ జంటగా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు పవర్‌ఫుల్‌ టైటిల్‌ అవసరమన్న భావనతో ‘రక్షకన్‌’గా మార్చినట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. విష్ణువిశాల్‌ పోలీస్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్‌ టీచర్‌గా నటిస్తున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement