Prabhas Charges Zero Remuneration for Maruthi Raja Deluxe Film - Sakshi
Sakshi News home page

Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆ సినిమాకు నో రెమ్యూనరేషన్..!

Published Mon, Feb 13 2023 4:23 PM | Last Updated on Mon, Feb 13 2023 5:09 PM

Prabhas charges zero remuneration for Maruthi Raja Deluxe film - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా డైరెక్టర్‌ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటికే రాజా డీలక్స్‌ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రెబల్ స్టార్  ప్రభాస్‌ ప్రస్తుతం వరుస పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త వైరలవుతోంది.  ప్రభాస్ ఈ చిత్రానికి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని సమాచారం. 

ప్రభాస్ వరసగా ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సాలార్ లాంటి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ల్లో నటించనున్నారు.  ఆ తర్వాత మారుతీ దర్శకత్వంలో రాజా డీలక్స్‌లో కనిపించనున్నారు. తాజా నివేదికల ప్రకారం ఈ సినిమా కోసం ఆయన ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదట. కొన్ని కథనాల ప్రకారం  సినిమా బడ్జెట్ పరిమితికి మించి పెరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పరిమిత బడ్జెట్‌తో తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలని ప్రభాస్ కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. 

 ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సాలార్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.  ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీలతో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె కూడా నటించనున్నారు. నటుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ కూడా ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement