Prabhas Project K Distribution Rights For Nizam Territory Sold For Shocking Amount - Sakshi

Prabhas Project K: భారీ ధరకు ప్రాజెక్ట్‌ కె రైట్స్.. ఎన్ని కోట్లంటే?

Published Mon, Jan 2 2023 8:17 PM | Last Updated on Mon, Jan 2 2023 8:36 PM

Prabhas Project K distribution rights for Nizam territory sold for Rs 70 crore - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మోస్ట్‌ అవేయిటెడ్‌ మూవీ 'ప్రాజెక్ట్‌ కె'. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన నిజా రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై నెట్టింట్లో చర్చ మొదలైంది. రెండు రోజుల క్రితమే ఈ మూవీ నుంచి ఓ మేకింగ్ వీడియో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తూ చిత్రం మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. అయితే ప్రాజెక్ట్ కె నిజాం హక్కులను ఏషియన్ సునీల్ సిండికేట్ రికార్డు ధర రూ.70 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all
Advertisement