పరమానందయ్య శిష్యులు | Sri Paramanandayya Sishyula Katha 3D Movie teaser launch | Sakshi
Sakshi News home page

పరమానందయ్య శిష్యులు

Published Thu, Oct 24 2019 2:36 AM | Last Updated on Thu, Oct 24 2019 2:36 AM

Sri Paramanandayya Sishyula Katha 3D Movie teaser launch - Sakshi

‘పరమానందయ్య...’లో ఓ దృశ్యం

పింక్‌ రోజ్‌ సినిమాస్‌ పతాకంపై కాటంరెడ్డి సంతన్‌రెడ్డి, సిహెచ్‌ కిరణ్‌శర్మ నిర్మాతలుగా వెంకట రాజేశ్‌ పులి దర్శకత్వం వహించిన చిత్రం ‘శ్రీ పరమానందయ్య శిష్యుల కథ’. ఈ త్రీడీ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో దర్శకుడు మారుతి విడుదల చేశారు. అనంతరం మారుతి  మాట్లాడుతూ– ‘‘చిన్నారుల కోసం ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని తీసిన చిత్రం ‘పరమానందయ్య శిష్యుల కథ’. ఈ చిత్రాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేసిన చిత్రబృందానికి కృతజ్ఞతలు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరు కుంటున్నాను’’ అన్నారు. చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పరమానందయ్య కథలోని నీతిని చిన్నారులకు మరింతగా చేరవేయటం కోసం ఈ చిత్రాన్ని త్రీడీ చేశాం. అన్ని  వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్, సంగీతం: యాజమాన్య.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement