
ఇంతకీ ఆ టైటిల్‌ని ఫిక్స్ చేశారా? ఈ టైటిల్ అనుకుంటున్నారా అంటూ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం గురించి చర్చ జరుగుతోంది. ఈ చిత్రం టైటిల్‌ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ‘రాజా డీలక్స్’ అని ఫిక్స్ చేశారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ‘వింటేజ్ కింగ్’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారనే వార్త వెలుగులోకి వచ్చింది. మరి.. వార్తల్లో ఉన్నట్లు ‘రాజా డీలక్స్’ని ఫిక్స్ చేశారా? లేక ‘వింటేజ్ కింగ్’ అనుకుంటున్నారా? అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
డబ్బింగ్ ఆరంభం
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ సినిమాలోని తొలి భాగం ‘సలార్: సీజ్ ఫైర్’ సెప్టెంబరు 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్‌ను ఆరంభించారు. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment