మారుతి దర్శకత్వంలో రాధాగా...
మారుతి దర్శకత్వంలో రాధాగా...
Published Fri, Dec 27 2013 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
వెంకటేష్ హోంమినిస్టరట. నయనతారేమో మధ్యతరగతి అమ్మాయట. మరి వీరిద్దరికీ ప్రేమెలా కుదిరిందట? అది మారుతినే అడగాలి. ఎందుకంటే... వెంకటేష్, నయనతారతో మారుతి తీయబోతున్న ‘రాధా’ సినిమా కథ చూచాయగా ఇదే. యువతరం నాడిని బాగా పట్టేసిన దర్శకుడు మారుతి. ఈ దఫా పెద్దాళ్లని కూడా బుట్టలో వేసుకునే పనిలో ఉన్నాడని ‘రాధా’ లైన్ వింటే అవగతమవుతోంది. జనవరి 16న పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఫిబ్రవరి నెలాఖరున షూటింగ్ మొదలుపెడతామని నిర్మాత డీవీవీ దానయ్య చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ -‘‘గత ఏడాది వచ్చిన ‘నాయక్’ తర్వాత మేం నిర్మించనున్న సినిమా ఇది. మారుతి చెప్పిన కథ నచ్చి, వెంకటేష్‌గారికి చెప్పించాం. ఆయన సింగిల్ సిట్టింగ్‌లో ఈ కథను ఓకే చేశారు. ఇక నయనతార అయితే... ఆరగంట కథ విని, ఈ సినిమా నేను చేస్తున్నానని నవ్వుతూ మాకు డేట్స్ ఇచ్చారు. ఇద్దరు టాప్‌స్టార్లను సింగిల్ సిట్టింగ్‌లో ఒప్పించిన కథ ఇది. వెంకటేష్, నయనతార స్థాయికి తగ్గట్టుగా ఈ ప్రేమకథ ఉంటుంది. మారుతి సంభాషణలు కొత్త పుంతలు తొక్కుతాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ప్రసాద్, సంగీతం: జె.బి., కూర్పు: ఉద్ధవ్, సమర్పణ: డి.పార్వతి.
Advertisement
Advertisement