![First Song Of Pakka Commercial Movie Will Be Release On 2nd Februrary - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/30/gopi-chand.jpg.webp?itok=vnbVaJuL)
‘పక్కా కమర్షియల్’ సినిమా కోసం జననం... మరణం గురించి దివంగత ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన పాట ఫిబ్రవరి 2న విడుదల కానుంది. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2పై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘‘సిరివెన్నెలగారు రాసిన చివరి పాట ఇది. ఈ స్ఫూర్తిదాయకమైన పాట భావోద్వేగంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.
‘జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘‘మరణం గురించి ముందే తెలిసినట్లు సిరివెన్నెలగారు కొన్ని పదాలను ఈ పాటలో సమకూర్చారు’’ అన్నారు మారుతి. గోపీచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి ఇతర ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: కరమ్ చావ్లా, సహనిర్మాత: ఎస్‌కేఎన్, లైన్ ప్రొడ్యూసర్: బాబు.
Comments
Please login to add a commentAdd a comment