Tottempudi Gopichand Opens about His Remuneration for Jayam Movie - Sakshi
Sakshi News home page

Gopichand: నా మొదటి సంపాదన చాలా తక్కువ, ఎంతంటే?

Jun 14 2022 12:12 PM | Updated on Jun 14 2022 12:42 PM

Gopichand Opens About His First Remuneration - Sakshi

నా సంపాదన జయంతోనే మొదలైంది. తేజగారి లక్కీ నంబర్‌ రూ.11 వేలు. అందుకని నాకు పారితోషికం కూడా అంతే ఇచ్చారు. దీని పక్కన ఓ సున్నా కూడా ఉండొచ్చు కదా అనిపించింది. అది నా మొదటి రెమ్యునరేషన్‌. ఆ డబ్బు తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చాను. ఇక నా జీవితంలో చాలామందికి అప్పిచ్చాను

విలన్‌గా కెరీర్‌ మొదలు పెట్టి హీరోగా రాణిస్తున్నాడు గోపీచంద్‌. మధ్యలో సినిమా ఎంపికలో కొన్ని తప్పులు చేసి తడబడ్డ గోపీచంద్‌ సీటీమార్‌ మూవీతో హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన పక్కా కమర్షియల్‌ సినిమా జూలై 1న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు జయం సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.

'నా సంపాదన జయంతోనే మొదలైంది. తేజగారి లక్కీ నంబర్‌ రూ.11 వేలు. అందుకని నాకు పారితోషికం కూడా అంతే ఇచ్చారు. దీని పక్కన ఓ సున్నా కూడా ఉండొచ్చు కదా అనిపించింది. అది నా మొదటి రెమ్యునరేషన్‌. ఆ డబ్బు తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చాను. ఇక నా జీవితంలో చాలామందికి అప్పిచ్చాను. కానీ కొందరు తిరిగివ్వలేరు. సరే, వాళ్ల పరిస్థితి బాగోలేదేమోలే అని వదిలేస్తానే తప్ప కమర్షియల్‌గా వ్యవహరించి వాళ్ల దగ్గర నుంచి నా డబ్బులు రాబట్టుకోలేదు' అని గోపీచంద్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: పెళ్లి చేసుకున్నాం, మా లైఫ్‌లో పెద్ద ఛేంజ్‌ ఏం లేదు
లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌, ఒక్కరితో కాదు ఇద్దరు, ముగ్గురితో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement