ఆ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: సదా | Actress Sadha Comments Gopichand Scene Jayam Movie | Sakshi
Sakshi News home page

Actress Sadha: ఆ సీన్ తర్వాత పదేపదే ముఖం కడుక్కుని.. కన్నీళ్లు పెట్టుకుని!

Published Tue, Sep 19 2023 9:20 PM | Last Updated on Tue, Sep 19 2023 9:28 PM

Actress Sadha Comments Gopichand Scene Jayam Movie - Sakshi

హీరోయిన్ సదా పేరు చెప్పగానే 'వెళ్లవయ్యా వెళ్లు..' అనే డైలాగ్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ డైలాగ్ పాపులారిటీ అలాంటిది మరి. అయితే హీరోయిన్ గా తెలుగులో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సదా.. ఆ తర్వాత సరైన ఛాన్సులు రాకపోవడంతో నటనని పక్కనబెట్టేసింది. ప్రస్తుతం రియాలిటీ షో జడ్జిగా పలు షోలు చేస్తోంది. అయితే గతంలో ఓ సినిమాలో ఓ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతోందట.

(ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!)

ఏ సీన్ గురించి..?
నితిన్-తేజ కాంబోలో వచ్చిన 'జయం' మూవీ టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన వాళ్లతో పాటు విలన్‌గా నటించిన గోపీచంద్‌కి కూడా అద్భుతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఈ మూవీలో ఓ సీన్‍‌లో భాగంగా హీరోయిన్ సదా బుగ్గపై.. విలన్ గోపీచంద్ నాలుకతో నాకుతాడు. సదా ఈ సీన్ గురించే చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సదా ఏం చెప్పింది?
'జయం సినిమాలో ఓ సీన్‌లో ఎందుకు నటించా అని ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆ సీన్ చేయనని దర్శకుడికి ముందే చెప్పాను. కానీ ఆయన నా మాట వినలేదు. మూవీకే ఆ సన్నివేశం హైలైట్‌గా నిలుస్తుందని చెప్పి ఒప్పించారు. అయితే ఆ సీన్ పూర్తయిన తర్వాత ఇంటికెళ్లి చాలాసేపు ఏడ్చాను. నా ముఖాన్ని పదేపదే కడుక్కున్నాను. ఇప్పటికీ టీవీలో ఆ విజువల్ వస్తే ఆ దరిదాపుల్లో ఉండను' అని సదా చెప్పినట్లు సదరు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: హిట్ ఇచ్చిన డైరెక్టర్‌నే అవమానించిన రజనీకాంత్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement